News February 5, 2025

తాగునీటి సమస్యపై జిల్లాస్థాయిలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు: కలెక్టర్

image

నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో డీపీవో ఆధ్వర్యంలో నీటి ఎద్దడి నివారణ-ముందస్తు ప్రణాళికల సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాబోవు 6 నెలల్లో జిల్లాల్లో తాగునీటి సమస్యకు సంబంధించి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఆదేశించారు. 08555-292439 నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News September 19, 2025

కడప: అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష

image

బాలికను అత్యాచారం చేసిన కేసులో వేంపల్లెకు చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులుకు కడప పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి యామిని 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధించారు. 15 ఏళ్ల బాలికను రామాంజనేయులు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి 2019లో వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. DSP వాసుదేవన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.

News September 19, 2025

NMMS స్కాలర్‌షిప్ గడువు పొడిగింపు: డీఈవో

image

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) కోసం విద్యార్థుల రిజిస్ట్రేషన్ గడువు ఈ నెల 30 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం తెలిపారు. 2024 డిసెంబర్ 8న జరిగిన పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులతో పాటు, 2021, 2022, 2023లో ఎంపికైన విద్యార్థులు కూడా నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో తప్పకుండా తమ దరఖాస్తులను పునరుద్ధరించుకోవాలని ఆయన సూచించారు.

News September 19, 2025

ఐటీఐ కోర్సులో మిగులు సీట్లు భర్తీ దరఖాస్తుల ఆహ్వానం

image

మన్యం జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మిగులు సీట్లు కొరకు 4వ విడత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని సాలూరు ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ డి.శ్రీనివాస ఆచారి గురువారం తెలిపారు. ఈ నెల 27 తేదీ వరకు వెబ్ పోర్టల్ http://iti.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. తరువాత ప్రింట్ తీసుకొని ఏదైనా ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకువెళ్లి అప్రూవల్ తీసుకోవాలని సూచించారు.