News February 5, 2025

సమిష్టి పోరాటంతోనే క్యాన్సర్ నియంత్రణ: మంత్రి సత్యకుమార్

image

ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సమిష్ఠి పోరాటంతోనే క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించడం సాధ్యమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి ప్రపంచంలోని అన్ని దేశాలకూ పెను సవాలుగా మారిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలలో 17.5 శాతం మేర కేవలం క్యాన్సర్ వ్యాధి కారణంగానే సంభవిస్తున్నాయని ఆయన వివరించారు.

Similar News

News March 7, 2026

ప్రకాశం: మహిళా దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

ప్రకాశం భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా సాధికారతను ప్రతిబింబించేలా వేడుకలు ఘనంగా జరిపించాలని సూచించారు. రవాణా, భోజనం, సాంకేతిక ఏర్పాట్లలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.

News March 7, 2026

ఇరాన్ యుద్ధంతో ఇండియన్ ఎకానమీకి ముప్పే: SBI రీసెర్చ్

image

పశ్చిమాసియాలో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఇండియా గ్రోత్ రేట్ నెమ్మదిస్తుందని SBI రీసెర్చ్ వెల్లడించింది. ‘క్రూడాయిల్ ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరిగి GDP వృద్ధి 0.25% వరకు తగ్గొచ్చు. హార్ముజ్ ద్వారా జరిగే చమురు సరఫరాకు ఆటంకం కలిగితే దిగుమతి ఖర్చులు భారమవుతాయి. గల్ఫ్ దేశాల నుంచి వచ్చే డబ్బు, ట్రేడ్‌పై కూడా ప్రభావం ఉంటుంది. ఇది దేశ ఎకానమిక్ స్టెబిలిటీకి ఛాలెంజింగ్‌గా మారుతుంది’ అని హెచ్చరించింది.

News March 7, 2026

అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 429 మంది గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు 429 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 4,378 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా, 3,949 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.