News March 19, 2024
షారుఖ్ నాకు చెప్పిన సందేశం అదే: గంభీర్
గౌతమ్ గంభీర్ ఈ సీజన్ నుంచి KKR మెంటార్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. టీమ్‌లో తిరిగి చేరాక జట్టు యజమాని షారుఖ్ తనతో అన్న మాటల్ని ఆయన తాజాగా వెల్లడించారు. ‘2011లో ఆటగాడిగా జట్టులో చేరినప్పుడు చెప్పిన విషయమే ఇప్పుడు కూడా షారుఖ్ నాకు చెప్పారు. ఇది నీ జట్టు. పాల ముంచినా, నీట ముంచినా నీదే అన్నారు. ఇక్కడ ఎన్నాళ్లు ఉంటానో తెలీదు కానీ.. వెళ్లేలోపు మరింత మెరుగుపరిచే వెళ్తాను’ అని స్పష్టం చేశారు.
Similar News
News January 8, 2025
తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
AP: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో నలుగురు భక్తుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. అటు టీటీడీ, జిల్లా అధికారులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. ఇక మంత్రి లోకేశ్ సైతం ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
News January 8, 2025
బూమ్ బూమ్ బీరు తీసుకొచ్చేందుకు కుట్ర: హరీశ్ రావు
TG: రాష్ట్రంలోకి లోకల్ బ్రాండ్స్ బూమ్ బూమ్, బిర్యానీ బీర్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని BRS నేత హరీశ్ రావు అన్నారు. అందుకే కింగ్ ఫిషర్, హీనెకిన్ బీర్ల సరఫరా నిలిపివేసిందని సర్కార్‌పై మండిపడ్డారు. ‘బీర్ల నిలిపివేతపై మాకు పలు అనుమానాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే వీటి సరఫరాను నిలిపేశారు. UBLకు పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన ట్వీట్ చేశారు.
News January 8, 2025
కోహ్లీ నాకు దేవుడు: కోన్‌స్టాస్
విరాట్ కోహ్లీ తనకు క్రికెట్ దేవుడని ఆస్ట్రేలియా యువ క్రికెటర్ సామ్ కోన్‌స్టాస్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆయన ఆటను చూస్తూ పెరిగాను. కోహ్లీ ఆడుతున్న సమయంలో నేను ఆడటమే నాకో గౌరవం. మ్యాచ్‌లు ముగిశాక నేను ఆయనతో మాట్లాడాను. నేను ఎంత పెద్ద అభిమానినో చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి. చాలా గౌరవంగా మాట్లాడారు. శ్రీలంక సిరీస్‌కు నేను ఎంపికైతే బాగా ఆడాలని విష్ చేశారు’ అని వెల్లడించారు.