News February 5, 2025

సంగారెడ్డి: 675 చెరువుల మ్యాపులు సిద్ధం చేయండి: కలెక్టర్

image

హెచ్ఎండిఏ పరిధిలోని 675 చెరువుల మ్యాపులు సిద్ధం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. చెరువులు ఆక్రమణకు గురికాకుండా ఇరిగేషన్, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి పాల్గొన్నారు.

Similar News

News March 18, 2026

మొజ్తబాను వెతికి పట్టుకుని చంపేస్తాం: ఇజ్రాయెల్

image

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని వెతికి పట్టుకుని చంపేస్తామని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది. ‘ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించే ఎవరినైనా లక్ష్యంగా చేసుకోవడాన్ని కొనసాగిస్తాం. మా దేశానికి వ్యతిరేకంగా చేయి ఎత్తిన వారు మా నుంచి <<19410383>>తప్పించుకోలేరు<<>>. వారిని వెంబడిస్తాం. కనుగొంటాం. హతమారుస్తాం’ అని IDF ప్రతినిధి ఎఫీ డెఫ్రిన్ స్పష్టంచేశారు. అయితే మొజ్తబా ఆచూకీపై తమ వద్ద సమాచారం లేదని చెప్పారు.

News March 18, 2026

తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో నేడు కిసాన్ మేళా

image

కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘కిసాన్ మేళా-2026’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి స్వప్న జాదవ్ తెలిపారు. సుమారు వెయ్యి మంది రైతులతో నిర్వహించే ఈ మేళాలో ఆధునిక యంత్రాల ప్రదర్శన, శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష చర్చలు, సరికొత్త సాగు సాంకేతికతపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించనున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.