News March 19, 2024

మెయిన్స్ రద్దు అప్పీల్‌పై విచారణ వాయిదా

image

AP: గ్రూప్-1 మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. మెయిన్స్‌ను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. కాగా మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం 2 సార్లు చేశారంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో పరీక్షను కోర్టు రద్దు చేసింది.

Similar News

News October 31, 2024

PLEASE CHECK.. ఈ జాబితాలో మీ పేరు ఉందా?

image

APలో ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 2.03 కోట్ల మంది పురుషులు, 2.10 కోట్ల మంది మహిళలు, థర్డ్ జెండర్ 3394 మంది ఉన్నారు. ఈ ఓటరు జాబితాపై నవంబర్ 28 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తారు. మార్పులు, చేర్పుల అనంతరం జనవరి 6న తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News October 31, 2024

Investing: ఈ వయసు వారే అత్యధికం

image

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారిలో 30 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీరు 2018లో 22.9% ఉండ‌గా Sep, 2024 నాటికి వారి సంఖ్య 40 శాతానికి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ట్రెండ్‌ వెల్త్ క్రియేష‌న్‌పై ఆర్థిక అవ‌గాహ‌న‌తో పెట్టుబ‌డులు పెట్టాల‌న్నయువ‌త ఉత్సాహానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. అయితే, 30 ఏళ్లు పైబడిన వారిలో ఇన్వెస్టింగ్ ధోర‌ణి క్ర‌మంగా త‌గ్గుతున్నట్టు NSE నివేదిక‌ వెల్ల‌డించింది.

News October 31, 2024

తిరోగమనంలో విద్యారంగం: YCP

image

ఏపీలో సర్కార్ విద్యకి CM చంద్రబాబు మంగళం పాడారని YCP మండిపడింది. దీపావళి కానుకగా పేదింటి బిడ్డల్ని నాణ్యమైన చదువుకి బాబు దూరం చేశారంది. ‘ఇంగ్లీషు మీడియం, CBSE, టోఫెల్ రద్దు. తల్లికి వందనమంటూ అమ్మఒడికి ఎగనామం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి తిలోదకాలు. అధ్వాన్నంగా మారిన స్కూళ్లు, హాస్టళ్లలో కలుషిత ఆహారంతో విద్యార్థుల ఆస్పత్రిపాలు. కూటమి 5 నెలల పాలనలో తిరోగమనంలో విద్యారంగం’ అని Xలో విమర్శలు గుప్పించింది.