News February 5, 2025
మంచిర్యాల కార్పొరేషన్ మాస్టర్ ప్లాన్‌కు ఏర్పాట్లు

మంచిర్యాల మున్సిపాలిటీని ప్రభుత్వం కార్పొరేషన్‌గా మార్చినందున మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు జీఐఎస్ ఆధారిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రోన్ సర్వే ప్రక్రియ పూర్తయిందని, బేసామ్యాప్ రూపొందించి సంబంధిత శాఖల ద్వారా వివరాలను సేకరించి పరిశీలిస్తామన్నారు.
Similar News
News March 21, 2026
నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

నిర్మల్, ఖానాపూర్, బైంసా మూడు మున్సిపాలిటీలలో ఆస్తీ పన్నుల వసూలుకు జిల్లాలో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా వార్డ్ ఆఫీసర్లు ఇంటింటా తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారు. మార్చి 31 నాటితో గడువు తేదీ ముగియనుండగా ఈ నెల 1 నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. మరో 11 రోజులు గడువు మాత్రమే ఉంది. 100% లక్ష్యాన్ని అధికారులు నెరవేరుస్తారా చూడాలి.
News March 21, 2026
రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇటీవల కేంద్రం అనౌన్స్ చేసిన 10% గ్యాస్‌కు ఇది అదనం. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.
News March 21, 2026
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఐజీ

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తనిఖీ చేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలోని పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.


