News February 5, 2025
నిర్మల్: గల్ఫ్ బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఇదే..!

గల్ఫ్ బాధితులకు సహాయాన్ని అందించేందుకై జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ బాధితుల కోసం, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేసేందుకు జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితుల కుటుంబ సభ్యులు 9398421883 నంబరులో సంప్రదించి తమ సమస్యలను తెలపాలన్నారు.
Similar News
News March 23, 2026
నల్గొండ: ఎస్సీ యాక్షన్ ప్లాన్ పథకాలను సద్వినియోగం చేసుకోండి!

జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా 2025-26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద అమలవుతున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో హిమబిందు కోరారు. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 24వ తేదీని చివరి గడువుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన పత్రాలతో నల్గొండలోని ఎస్సీ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News March 23, 2026
చిత్తూరు: శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్

చిత్తూరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. కుప్పం, పలమనేరు, నగిరి డివిజన్ పరిధిలో జన గణన చేపట్టే ఫీల్డ్ ట్రైనర్లకు మూడు రోజులపాటు శిక్షణ నిర్వహించనున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు. పకడ్బందీగా జన గణన చేపట్టాలని ఆయన సూచించారు. శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 23, 2026
విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: రేవంత్

TG: మూసీ నిర్వాసితులకు అన్యాయం చేయబోమని సీఎం రేవంత్ అసెంబ్లీలో పునరుద్ఘాటించారు. వారికి మెరుగైన వసతులతో పునరావాసం కల్పిస్తామని, విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు వ్యాపారాలు చేసుకోవడానికి సహకరిస్తామన్నారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని వారికి సూచించారు.


