News February 5, 2025

కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

image

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల, నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.

Similar News

News November 6, 2025

‘ఫ్యాషన్ పెళ్లిళ్లు వద్దు’

image

ఉమ్మడి అనంత జిల్లాల ప్రభుత్వ ఖాజీలు గుంతకల్లు ప్రభుత్వ ఖాజీ కార్యాలయంలో బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. సినిమా షూటింగ్‌లు, ఫొటో సెషన్‌ల ప్రదర్శనతో నిఖా పవిత్రత కోల్పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిఖా కేవలం ఇస్లామియా పద్ధతిలో సంప్రదాయంగా జరగాలన్నారు. ఫ్యాషన్ పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని, సంప్రదాయ నిఖా విధానాల పునరుద్ధరణ చేయాలని అన్నారు. నిజమైన దైవబంధాన్ని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

News November 6, 2025

కర్నూలులో నేడే జాబ్ మేళా

image

కర్నూలులో ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 6న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి దీప్తి తెలిపారు. ఈ మేళాలో రిలయన్స్ కన్స్యూమర్ కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ ఖాళీలు 120 ఉన్నాయన్నారు. ఐటీఐ/డిప్లొమా చదివిన విద్యార్థులు అర్హులన్నారు. నిరుద్యోగ యువత ముందుగా ఎన్‌సీఎస్ వెబ్సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

News November 6, 2025

ఆర్డీవోలు తహశీల్దార్లతో సమీక్షించాలి: VZM కలెక్టర్

image

రెవెన్యూ సేవల కోసం అందిన దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెండింగ్ వినతులు ఉంటే సహించేది లేదన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, OBC, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు, మ్యుటేషన్లు వంటి సేవలు నిర్దేశిత గడువు దాటకుండా పూర్తవ్వాలని, ఆర్‌డీవోలు రోజువారీగా తహశీల్దార్లతో సమీక్షించాలన్నారు.