News February 5, 2025

కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

image

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకల నిషేధంపై అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.

Similar News

News February 5, 2025

కొమ్మాలలో అద్భుతం.. సూర్య కిరణాల మధ్య లక్ష్మీనరసింహస్వామి

image

గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు గుట్టల నడుమ ఉన్న నరసింహస్వామి విగ్రహాలను బుధవారం ఉదయం పూజా సమయంలో సూర్యకిరణాల తాకిడితో నరసింహస్వామి ప్రతిబింబం మెరుస్తూ కనిపించింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.

News February 5, 2025

పంచాయతీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్?

image

తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. కులగణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం స్పష్టతకు రావడంతో మరో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించకపోయినా, పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ టైం పట్టదంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

News February 5, 2025

కొమ్మాలలో అద్భుతం.. సూర్య కిరణాల మధ్య లక్ష్మీనరసింహస్వామి

image

గీసుగొండ మండలం కొమ్మాల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు గుట్టల నడుమ ఉన్న నరసింహస్వామి విగ్రహాలను బుధవారం ఉదయం పూజా సమయంలో సూర్యకిరణాలు తాకాయి. సూర్యకిరణాల తాకిడితో నరసింహస్వామి ప్రతిబింబం మెరుస్తూ కనిపించింది. ఆలయానికి వచ్చిన భక్తులు ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాల్లో బంధించారు.

error: Content is protected !!