News February 5, 2025

బాపట్ల: టీడీపీ స్థలం కబ్జా.. నిందితులు అరెస్ట్

image

బాపట్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన స్థలాన్ని కబ్జా చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన నిందితులను అరెస్టు చేసినట్లు బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. మంగళవారం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. 2000 సంవత్సరంలో దాతలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా ఇవ్వగా పలువురు స్థలాన్ని కబ్జా చేసి విక్రయించినట్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News April 2, 2026

కర్నూలు ఇక నుంచి 68 డివిజన్లు

image

52 డివిజన్లకు పరిమితమైన కర్నూలు నగరపాలక సంస్థకు మరో 16 డివిజన్లు అదనంగా పెంచారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 68 డివిజన్లుగా మార్పు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కావాలనుకుంటున్న అన్ని రాజకీయ పార్టీలోని ఆశావాహులకు ఇదో చక్కటి అవకాశంగా పలువురు అభివర్ణిస్తున్నారు.

News April 2, 2026

సేల్స్‌లో ఎలక్ట్రిక్ కార్ల వాటా 5శాతమే.. అదే కారణమా?

image

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నా కార్లలో వీటి వాటా ఐదు శాతంలోపే ఉంది. FY26లో మొత్తం 2,29,000 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడుపోయాయి. అంతకుముందు ఏడాదితో (1,23,400 యూనిట్లు) పోలిస్తే వృద్ధి నమోదైనా ఆశించినంత వేగంగా సేల్స్ పెరగట్లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఛార్జింగ్ స్టేషన్ల కొరత, కార్ రేంజ్‌ – రీసేల్ వ్యాల్యూపై అనుమానాలు ఇందుకు కారణమని పేర్కొంటున్నాయి.

News April 2, 2026

పాలమూరు: హైటెక్ వ్యభిచార ముఠా గుట్టురట్టు

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో ఉన్న శ్రీ సాయి బాలాజీ టవర్స్‌లోని ఫ్లాట్ నంబర్ 309లో గుట్టుగా నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రంపై టూ టౌన్ పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలు, ఐదుగురు విటులు, కండోమ్ ప్యాకెట్లు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ ఐజాజుద్దీన్ పోలీసులు తెలిపారు. నిర్వాహకుడు సంతోష్ రెడ్డి పరారీలో ఉన్నాడు.