News February 5, 2025

వెనుకబడిన ఎన్ని జిల్లాలను కేంద్రం గుర్తించింది: ఖమ్మం ఎంపీ

image

విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు, విద్యాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్‌సభలో ప్రశ్నించారు. గత ఐదేళ్లలో విద్యాపరంగా వెనుకబడిన ఎన్ని జిల్లాలను గుర్తించారని, తాజా జనాభా లెక్కల ప్రకారం ఆయా జిల్లాల్లో SC,ST నిష్పత్తి ఏ విధంగా ఉందని అడిగారు. దీనికి కేంద్ర సహాయ మంత్రి జయంత్ ఎంపీకి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Similar News

News March 19, 2026

ఇంటి ముంగిటకే వైద్యం: డీఎంహెచ్‌ఓ రామారావు

image

ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 20 స్పెషలిస్ట్ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ డి. రామారావు తెలిపారు. ఈ నెల 31 వరకు శిబిరాలు కొనసాగనున్నాయని చెప్పారు. స్త్రీ, శిశు, కంటి వైద్య నిపుణులు ఉచిత సేవలు అందిస్తారని, ఇప్పటివరకు 9 శిబిరాలు పూర్తయ్యాయన్నారు. మిగిలిన శిబిరాల్లో పరీక్షలు, మందులు ఉచితంగా అందజేస్తామని ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

News March 19, 2026

ఖమ్మం: ఉద్యోగం లేని వారికి మంచి ఛాన్స్

image

ఖమ్మం జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్లు DYSO సునీల్ రెడ్డి తెలిపారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో 3 నెలల శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఆసక్తి గలవారు ఆధార్, విద్యార్హత పత్రాలతో నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని, వివరాలకు 99482 07271 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

News March 19, 2026

రైలు ఢీకొని వృద్ధుడి మృతి

image

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడుమృతి చెందాడు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం బోనకల్లు-చింతకాని రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న జీఆర్‌పీ ఎస్‌ఐ వెంకటేశ్వరరావు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతుడిని గుర్తించిన వారు 96529 39431 నంబరుకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.