News February 5, 2025

కవ్వాల్ అభయారణ్యంలో రాకపోకలకు గ్రీన్ సిగ్నల్

image

కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని చెక్ పోస్ట్‌ల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు వాహనాల రాకపోకలకు అనుమతులిస్తూ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తెలిపారు. మంగళవారం సాయంత్రం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి చెక్ పోస్ట్‌ల వద్ద వాహనాలను అనుమతిస్తారని పేర్కొన్నారు.

Similar News

News July 7, 2025

జిల్లాలో ఎరువులు కొరత లేదు: జిల్లా వ్యవసాయ అధికారి

image

తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవ రావు సోమవారం తెలిపారు. జిల్లాలో గత ఏప్రిల్ నెల నుంచి ఇప్పటివరకు 35,869 టన్నుల వేర్వేరు రకాల ఎరువులను ప్రైవేటు డీలర్లు, మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. ఇందులో యూరియా 15,294 టన్నులు, డీఏపీ 2,615 టన్నులు, పొటాష్ 2,918 టన్నులు, సూపర్ 6,324 టన్నులు ఉన్నాయన్నారు.

News July 7, 2025

రంప : 9000మంది విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్

image

రంపచోడవరం, చింతూరు డివిజన్‌లో 21 గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందని ITDA. PO. సింహాచలం సోమవారం ప్రకటనలో తెలిపారు. దాదాపు 9 వేల మంది బాల, బాలికలకు వీటిని అందజేస్తామన్నారు. డిటర్జెంట్ సోప్స్, పౌడర్, బాత్ సోప్స్, షాంపు పాకెట్స్, కోకోనట్ ఆయిల్, వేజలైన్, టూత్ పేస్ట్, బ్రష్ తదితర వస్తువులు ఉంటాయని తెలిపారు.

News July 7, 2025

ముల్డర్ సరికొత్త చరిత్ర

image

జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా క్రికెటర్ వియాన్ ముల్డర్ సంచలనం నమోదు చేశారు. అరంగేట్ర టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ బాదిన తొలి కెప్టెన్‌గా నిలిచారు. 297 బంతుల్లో 38 ఫోర్లు, 3 సిక్సర్లతో ఈ మార్క్ చేరుకున్నారు. టెస్టుల్లో ఇది రెండో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ. అంతకుముందు సెహ్వాగ్ 278 బంతుల్లో ఈ ఘనత అందుకున్నారు.