News February 5, 2025
నేటి నుంచి మేడారంలో తొలి ఘట్టం!

తాడ్వాయి మండలం మేడారంలో నేటి (బుధవారం) నుంచి సమ్మక్క-సారలమ్మ మినీ జాతర పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలోని సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో పూజారులు శుద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజ సామగ్రిని శుద్ధిచేసి నైవేద్యాలు సమర్పించి మినీ జాతర విజయవంతం కావాలని అమ్మవార్లను మొక్కుకుంటారు. కాగా ఈనెల 12 నుంచి మినీ జాతర ప్రారంభం కానుంది.
Similar News
News March 20, 2026
వాట్సాప్‌లో సూపర్ అప్‌డేట్

వాట్సాప్ త్వరలో ఫోన్ నంబర్ల స్థానంలో యూజర్ నేమ్స్, యునిక్ ఐడీలను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో ఇది లాంచ్ కానున్నట్లు సమాచారం. దీంతో ఫోన్ నంబర్ల అవసరం లేకుండానే కొత్త ఫ్రెండ్స్, గ్రూప్స్‌తో కనెక్ట్ అవొచ్చు. ఫోన్ నంబర్లతోనే కంటిన్యూ అవ్వాలనుకునేవారు ఆప్షనల్ ప్రైవసీ ఫీచర్ ఎంచుకోవచ్చు. ఇక దీంతో పాటు వాట్సాప్ లేని వారితో చాట్ చేసేందుకు వీలుగా గెస్ట్ చాట్ ఫీచర్ తేనున్నట్లు తెలుస్తోంది.
News March 20, 2026
MBNR: రంజాన్ ఎంతో పవిత్రమైనది: ఎస్పీ

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతిని నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉపవాస దీక్షల ద్వారా పొందే ఆత్మశుద్ధి, సహనం, సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.
News March 20, 2026
విద్యుత్ భద్రతకు లైన్ క్లియర్ యాప్: ఎస్ఈ

విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంతో పాటు క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతను పటిష్టపరిచేందుకు ఎల్సీ (లైన్ క్లియర్) యాప్ తీసుకొచ్చామని ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్ రావు తెలిపారు. ఈ యాప్ విద్యుత్ రంగంలో పనిచేసే సిబ్బంది భద్రతకు అత్యంత కీలకంగా మారిందని అన్నారు. తప్పుడు ఫీడర్ ఎంపిక, పంపిణీ వ్యవస్థపై అస్పష్టత, సమాచార లోపం విషయాల్లో భద్రతగా ఉంటుందన్నారు.


