News February 5, 2025

‘3 రోజులు మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయాలి’

image

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీహరి హర పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు గ్రామంలో చికెన్, మటన్ విక్రయాలు చేయవద్దని బజరంగ్ దళ్ మండల నాయకులు విజ్ఞప్తి చేశారు. గ్రామంలోని దాభాలు, వైన్ షాప్‌ల నిర్వాహకులు మూడు రోజుల వరకు విక్రయాలు చేయకుండా తమకు సహకరించాలని కోరారు.

Similar News

News November 8, 2025

‘అలిపిరి’ అంటే అర్థం మీకు తెలుసా?

image

తిరుపతి నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి కాలినడకన వెళ్లడానికి తొలి ప్రవేశ మార్గం ‘అలిపిరి’. సోపానమార్గంలో కనిపించే తొలి ప్రదేశం ఇదే. ఈ అలిపిరిని కొందరు ‘అడిప్పడి’ అని అంటారు. అడి అంటే అడుగున ఉన్న భాగం. పడి అంటే మెట్టు. తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశమే ఇది. కొందరు దీన్ని అడిప్పుళి అని కూడా అంటారు. పుళి అంటే చింత చెట్టు. అడుగు భాగాన కనిపించే చింతచెట్టు ప్రదేశమని దీని భావం. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 8, 2025

గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ టికెట్ బుకింగ్

image

టికెట్ బుకింగ్ కోసం APSRTC మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లాలో గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేస్తే ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సులు, జర్నీ టైమ్‌ వివరాలు కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే RTC వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. ఈ మేరకు గూగుల్ ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాయి. VJA-HYD మార్గంలో అమలుచేయగా విజయవంతమైంది. త్వరలో అన్ని రూట్లలో మొదలుకానుంది.

News November 8, 2025

కొత్తకోట వద్ద కారు, లారీ ఢీ.. సెక్రటరీ మృతి

image

గద్వాలలో వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా, కొత్తకోట వద్ద కారు ఆపగా.. వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ కారుపై బోల్తా పడింది. కారులో ఉన్న వేముల గ్రామ పంచాయతీ సెక్రటరీ సతీష్ రెడ్డి తీవ్ర గాయాలై, ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. ఆ సమయంలో టాయిలెట్ కోసం కిందకు దిగిన ముగ్గురు సెక్రెటరీలు ప్రాణాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు.