News February 5, 2025
రూ. 5కే కిలో చికెన్.. ఎక్కడో తెలుసా?

రాజాంలో ఓ చికెన్ షాప్ వ్యాపారి వినూత్న ఆలోచన చేశాడు. కేవలం రూ.5 కే కేజీ చికెన్ అందిస్తున్నాడు. ఇదెలా సాధ్యం అనుకుంటే పోరపాటే.. కానీ అక్కడే కొంత మెలిక పెట్టాడు. కాయిన్స్ కాకుండా నోటుకు మాత్రమే ఈ ఆఫర్ పెట్టాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బైటకి పొక్కడంతో పాత నోట్లతో ప్రజలు చికెన్ కొట్టుకు మంగళవారం క్యూ కట్టారు. రూ. 5 నోటు ఇచ్చిన వారికి కిలో చికెన్ ఇచ్చారు.
Similar News
News March 16, 2026
భారీగా తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ₹2,240 తగ్గి ₹1,57,420కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹2,050 తగ్గి ₹1,44,300 వద్ద స్థిరపడింది. ఇక కిలో వెండి ధర ఈరోజు ₹4వేలు తగ్గి ₹2,76,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండొచ్చు.
News March 16, 2026
ఢిల్లీ పార్లమెంట్‌లో ‘సేవ్ ఆర్డీటీ’ నినాదాలు

ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో వైసీపీ ఎంపీలు, ముఖ్య నేతలు ‘SAVE RDT’ పోస్టల్ కార్డులతో నిరసన తెలిపారు. ఆర్డీటీ సంస్థను కాపాడాలంటూ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, గురుమూర్తి, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మల్లికార్జున రెడ్డి, తనుజ తదితరులు నినాదాలు చేశారు. పేదలకు సేవలందిస్తున్న సంస్థపై వేధింపులు ఆపాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఎఫ్‌ఆర్సీఏను కేంద్రం పునరుద్ధరించాలని కోరారు.
News March 16, 2026
అమరజీవి త్యాగం తెలుగు జాతికి ఆదర్శం: అడిషనల్ ఎస్పీ

జిల్లా పోలీస్ కార్యాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ వి.వి. నాయుడు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు గారు తెలుగు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్లు రవికిరణ్, రవి కుమార్ పాల్గొన్నారు.


