News March 19, 2024
‘అదానీ గ్రూప్‌పై US దర్యాప్తు’.. కొట్టిపారేసిన సంస్థ

అదానీ గ్రూప్‌పై US అధికారులు దర్యాప్తు చేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని ఆ సంస్థ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు తమకు ఎలాంటి నోటీసులు అందలేదని పేర్కొంది. కాగా భారత్‌లో ఓ విద్యుత్ ప్రాజెక్ట్ కోసం అదానీ గ్రూప్ అధికారులకు ముడుపులు చెల్లించి అవినీతికి పాల్పడిందనే ఆరోపణలపై US దర్యాప్తు చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ సంస్థ పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రభావంతో అదానీ షేర్లు, బాండ్లు భారీగా పడిపోయాయి.
Similar News
News July 8, 2025
జలాలే మన సంపద, వాటితోనే కష్టాలు తీరుతాయి: CBN

AP: ఇవాళ తన జీవితంలో సంతోషకరమైన రోజని CM చంద్రబాబు అన్నారు. జులై తొలి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటం శుభపరిణామం అని చెప్పారు. జలాలే మన సంపద అని, వాటితోనే రైతుల కష్టాలు తీరుతాయని వ్యాఖ్యానించారు. ‘నీటి కరవు ఉన్న రాయలసీమను ఎవరూ కాపాడలేరని చాలామంది అన్నారు. కానీ ఆ ప్రాంత స్థితిగతులు మార్చేందుకు NTR నడుం బిగించారు. ఇప్పుడు రాయలసీమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నా’ అని వెల్లడించారు.
News July 8, 2025
జైలులో కాకాణికి తోడుగా ఉంటా: ప్రసన్న కుమార్ రెడ్డి

AP: TDP MLA <<16988626>>వేమిరెడ్డి ప్రశాంతి<<>>పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని YCP నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ‘ప్రశాంతి నాపై కేసులు పెట్టినా, కోర్టుకు వెళ్లినా ఫర్వాలేదు. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినా అభ్యంతరం లేదు. నన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపితే కాకాణి గోవర్ధన్ రెడ్డికి తోడుగా ఉంటా’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News July 8, 2025
సిగాచీలో ముగిసిన NDMA బృందం పరిశీలన

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. ప్రమాదం జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.