News February 5, 2025

పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు డిగ్రీ విద్యార్థి ఘనత

image

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈనెల 2న జరిగిన 7వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌లో ఎమ్మిగనూరు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పింజారి బషీర్ సత్తా చాటాడు. 100 మీటర్లు, 1,500 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించాడు. ఈ విజయంతో కళాశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని కళాశాల అధ్యక్షుడు డా.మహబూబ్ బాషా పేర్కొన్నారు. బషీర్‌ను కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.

Similar News

News March 12, 2026

కర్నూలులో 250 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు!

image

కర్నూలులోని అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్‌లో ఉన్న నందనం డిగ్రీ కాలేజీలో ఈనెల 14న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీల్లో సుమారు 250 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చదివినవారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు బయోడేటాతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కళాశాల కరెస్పాండెంట్ జనార్ధన్ తెలిపారు.

News March 12, 2026

కర్నూలు: సెలవుల్లేని సేవ.. రోగులకు అండగా సిరాజ్ ఉల్

image

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ సిరాజ్ ఉల్ 15 ఏళ్లుగా నిరంతరం రోగులకు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సెలవులు, ఆదివారాల్లోనూ విధులు నిర్వర్తిస్తూ ఆసుపత్రికి వచ్చే సుమారు 700 మంది రోగులకు మందులు అందిస్తున్నారు. ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు ఒకే కౌంటర్ ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్రమబద్ధంగా మందులు పంపిణీ చేస్తూ సేవాభావాన్ని చాటుతూ.. అందరి మన్ననలు పొందుతున్నారు.

News March 12, 2026

ఆదోనిలో లెటర్ రాసి సూసైడ్

image

ఆదోనిలోని కల్లుబావి వీధిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం చోటుచేసుకుంది. బంధువుల వివరాల మేరకు.. కురువ రాఘవేంద్రకు రెండెకరాలు సొంత పొలం ఉంది. దీంతో పాటు మరో ఐదెకరాలలో వ్యవసాయం చేసేవాడు. వ్యవసాయం, ఇతర ఖర్చుల కోసం రూ.10 లక్షలకు పైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక అయోమయానికి గురై తన చావుకు అప్పులే కారణం అంటూ లెటర్ రాసి ఇంట్లో ఉరేసుకొన్నాడు.