News February 5, 2025
చికిత్స పొందుతూ యువకుడి మృతి

పగిడ్యాల మండల కేంద్రానికి చెందిన పరమేశ్ నాయుడు(22) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ముచ్చుమర్రి ఏఎస్ఐ శేషయ్య వెల్లడించారు. ఐటీఐ చదివి వ్యవసాయం చేసుకుంటున్న పరమేశ్.. గత నెల 27న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Similar News
News September 16, 2025
ఉమ్మడి చిత్తూరు: డీఎస్సీలో 70 మిగులు సీట్లు

డీఎస్సీ-2025లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ఎంపికైన జాబితాను తాజాగా విద్యాశాఖ వెల్లడించింది. జిల్లాలో 1,478 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించగా 1,408 మంది ఎంపికయ్యారు. 70 మిగులు సీట్లు ఉన్నాయి. ఎంపికైన వారికి ఈనెల 19న విజయవాడలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు.
News September 16, 2025
ఇంటర్ కాలేజీల ఎంప్లాయిస్‌కు ఆన్లైన్ సేవలు..!

ప్రభుత్వ ఇంటర్ కాలాశాలల్లో పనిచేసే ఉద్యోగుల కోసం ప్రభుత్వం ఆన్లైన్ సేవలను ప్రారంభించింది. వీరికోసం హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం అనే పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇందులో ఎంప్లాయిస్ లీవ్స్, NOC, మెడికల్ రీయింబర్స్మెంట్, ఇంక్రిమెంట్స్, సర్వీస్ హిస్టరీ, పెన్షన్ వంటి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఉమ్మడి KNRలో 53 ఇంటర్ కాలేజీలు ఉండగా, ఇందులో 1100 మందివరకు లెక్చరర్స్‌తోపాటు సిబ్బంది ఉన్నారు.
News September 16, 2025
విజయవాడ: వర్షాలకు పంట నష్టం.. ఎస్టిమేషన్స్ రెడీ!

జిల్లాలో గత నెల రోజులుగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో పంటలు కొంతమేర దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 1136.98 హెక్టార్లతో పంట నష్టం వాటిల్లింది. ఇందులో మినుము, పెసర, వరి, పత్తి పంటలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్‌పుట్ రాయితీ రూ.27లక్షలకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఈ వివరాలు పంపారు. త్వరలో ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.