News February 5, 2025
విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

విద్యార్థినిపై అత్యాచారం కేసులో జూనియర్ లెక్చరర్ వేదాల వినయ్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు. కేసు వివరాలను కొవ్వూరులో DSP దేవకుమార్ తెలిపారు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వినయ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో జూ.లెక్చరర్‌గా పని చేస్తున్నారు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఇంటర్ సెకండియర్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ నెల 28న విజయవాడలో లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Similar News
News March 20, 2026
నగరాభివృద్ధికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్

కర్నూలు నగరాభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. శుక్రవారం వెంకటరమణ కాలనీలోని నగరపాలక సంస్థ కార్యాలయంలోని ఆమె తన ఛాంబర్‌ను ప్రారంభించారు. కమిషనర్ పి.విశ్వనాథ్ పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. నగర పరిపాలనలో సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం తన కార్యాలయంలో కేఎంసి పూర్తి మ్యాప్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
News March 20, 2026
SVU: రేపటి డిగ్రీ పరీక్ష వాయిదా

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ(UG) ఇయర్ ప్యాటర్న్ అభ్యర్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రంజాన్ సందర్భంగా శనివారం జరగాల్సిన పరీక్ష వాయిదా వేసినట్లు పరీక్ష విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. వాయిదా పడిన పరీక్ష ఏప్రిల్ 6వ తేదీ జరగనుందన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News March 20, 2026
నెల్లూరు: గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు

నెల్లూరు రూరల్ అక్కచెరువుపాడు మైనార్టీ బాలురు గురుకుల పాఠశాలలో 5, 6, 7, 8వ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు మార్చి 31వ తేదీ లోపు https://aprs.apcfss.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు ఏప్రిల్ 24వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని చెప్పారు.


