News February 5, 2025
ఉయ్యూరు: కాలువలో పడి వ్యక్తి మృతి

ఉయ్యూరు సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాలువలో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సుందరయ్య నగర్‌కు చెందిన ఎడ్ల రాంబాబు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మంగళవారం కాలువ అరుగు పై కూర్చుని ఉండగా ప్రమాదవశాత్తు కాలంలో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు.
Similar News
News March 16, 2026
కృష్ణా: టెన్త్ పరీక్షల కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే..!

పదవ తరగతి పరీక్షలు నేటి నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సందేహాలు ఉన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 9491505378, 9441665999, 7702427788, 9849501067 ఫోన్ చేసి తెలియజేయాలని DEO UV సుబ్బారావు కోరారు. 24 గంటలూ ఫోన్ కాల్స్ స్వీకరిస్తామన్నారు.

కృష్ణా: మూడు కేటగిరీలుగా టెన్త్ పరీక్షా కేంద్రాలు

కృష్ణాజిల్లాలో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నారు. పరీక్షల నిర్వహణకుగాను 148 కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిని A, B, C కేటగిరీలుగా విభజించారు. 8KM లోపు పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ ఉన్న 55 కేంద్రాలను A కేటగిరీగా విభజించారు. పోలీస్ స్టేషన్ లేదా ట్రెజరీ ఆఫీస్ ఉన్న 43 కేంద్రాలను B కేటగిరీగా, పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీస్ లేని 50 కేంద్రాలను C కేటగిరీగా విభజించారు.