News February 5, 2025
తంబళ్లపల్లి: వింత వ్యాధితో నాటు కోళ్లు మృతి

తంబళ్లపల్లి మండలం కోటకొండ గ్రామం మద్దిరాల పల్లిలో నిన్నటి నుంచి 500 నాటు కోళ్లు మృతి చెందాయని గ్రామస్థులు చెబుతున్నారు. అంతుచిక్కని వింత వ్యాధితో వ్యాక్సిన్ వేసిన కోళ్లు కూడా చనిపోయాయని తెలిపారు. కేజీ రూ.450 పలుకుతున్న నాటు కోళ్లు మృతి చెందడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు వాటి యజమానులు వాపోతున్నారు.
Similar News
News February 28, 2026
మత్తు పదార్థాల విక్రయదారులను కనిపెట్టాలి: కలెక్టర్

పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్య శారద పోలీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా నార్కోటిక్ కమిటీ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఆమె సమీక్షించారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లో మాదక ద్రవ్యాల రవాణా జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.
News February 28, 2026
అధికారుల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి: కలెక్టర్

గద్వాల జిల్లా అన్ని రంగాల్లో ముందుండాలంటే వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ, ఫార్మర్ రిజిస్ట్రేషన్, గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.
News February 28, 2026
CBI క్లీన్ చిట్.. మరి ED కేసు?

లిక్కర్ పాలసీకి సంబంధించి CBI కేసులో కేజ్రీవాల్‌కు క్లీన్ చిట్ వచ్చినప్పటికీ.. ED దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసు మాత్రం అలాగే ఉంది. తమ దర్యాప్తు కొనసాగుతుందని, వ్యక్తుల వాంగ్మూలాలు, పక్కా ఆధారాలతోనే కేసు నమోదు చేశామని ED వర్గాలు చెబుతున్నాయి. CBI FIR ఆధారంగానే ఈ కేసు మొదలైనప్పటికీ తమ దర్యాప్తు స్వతంత్రంగా సాగుతుందని అంటున్నాయి. హైకోర్టులోనూ CBI కేసు వీగిపోతే ED కేసు స్థితి ఏంటో చూడాలి.


