News February 5, 2025

సీరోల్: డాన్స్ చేస్తూ విద్యార్థిని కుప్పకూలి మృతి

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో బుధవారం డాన్స్ చేస్తూ ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది. స్థానిక విద్యార్థులు తెలిపిన వివరాలు.. ఇంటర్ విద్యార్థిని రోజా డాన్స్ చేస్తూ కుప్పకూలింది. వెంటనే బాలిక తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సమాచారం ఇచ్చి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 13, 2026

నిజామాబాద్: వారికి కలెక్టర్ హెచ్చరిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి డుమ్మా కొట్టిన అధికారులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాటి కార్యక్రమానికి గైర్హాజరైన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. మొదటి తప్పుగా భావించి మెమోలిస్తున్నామని, పునరావృతమైతే వేతనాల్లో కోతతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు.

News January 13, 2026

కడప: మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు!

image

కడప జిల్లాలో గతనెల 1,43,405 కేసుల లిక్కర్ (IML), 54,938 కేసుల బీరు తాగేశారు. డిసెంబర్‌లో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.98.98 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఒక్కరోజులోనే జిల్లాలో 9,658 కేసులు లిక్కర్, 3,991 కేసులు బీరు తాగారు. ఆ ఒక్క రోజులోనే రూ.7.23 కోట్ల ఆదాయం లభించింది. APలో రూ.99ల మద్యం, బీరు మినహా అన్ని బాటిళ్లపై రూ.10లు పెంచుతూ సోమవారం GO విడుదలైన విషయం తెలిసిందే.

News January 13, 2026

వికారాబాద్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది..!

image

వికారాబాద్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో తాండూర్ మున్సిపాలిటీలో 36 వార్డుల్లో 77,110 ఓటర్లు, వికారాబాద్‌లో 34 వార్డులకు 58,117, పరిగిలో 18 వార్డుల్లో 27,616, కొడంగల్‌లో 12 వార్డులకు 11,318 మంది ఓటర్లు ఉన్నారు. తుది జాబితాను ఆయా మున్సిపాలిటీల్లోని నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. ఫైనల్ లిస్ట్‌లో మీపేరు ఉందా చెక్ చేయండి.