News February 5, 2025
స్థానిక ఎన్నికలకు సిద్ధం అవ్వండి: మాజీ ఎమ్మెల్యే

రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, ఎన్నికల్లో BRS జెండా ఎగరవేయాలని నాయకులు, కార్యకర్తలకు మాజీ MLA సతీశ్ కుమార్ పిలుపునిచ్చారు. నిత్యం ప్రజల్లో ఉండాలని, ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి అండగా నిలవాలని సూచించారు. నిన్న హుస్నాబాద్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో అందరికీ అవకాశాలు ఉంటాయని, నాయకులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Similar News
News April 4, 2026
కన్నుల పండుగగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి క్షేత్రంలో శనివారం సీతారామచంద్రస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజామున స్వామివారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం, అర్చకులు వేద మంత్రాల సాక్షిగా ఈ క్రతువును పూర్తి చేశారు. భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం కనులారా వీక్షించి తరించారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ.. ఎవరికో అవకాశం?

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీతో పాటు కొందరి శాఖలు కూడా మారతాయని చర్చ జరుగుతోంది. కొత్తగా ఒక BC, ST ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని సమాచారం. ఇక మంత్రి పదవి చేపట్టిన అజహరుద్దీన్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన MLC అవుతారా? లేదా? అన్నది సందిగ్ధంలో పడింది.