News February 5, 2025
ప్రవేశ పరీక్షలకు ఎస్సీ ఉపకులాలవారీగా దరఖాస్తుల స్వీకరణ

TG: SC వర్గీకరణకు అసెంబ్లీ, మండలి నిన్న ఆమోదం తెలిపిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు ఎస్సీల దరఖాస్తుల్ని ఉపకులాల వారీగా స్వీకరించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఉపకులాలతో సంబంధం లేకుండా SC విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతోంది. కాగా.. ఈ నెల 25 నుంచి EAPCET దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. ఆలోపు వర్గీకరణపై ఆదేశాలు వెలువడితే దరఖాస్తుల్ని ఉపకులాలవారీగా స్వీకరించే అవకాశం ఉంది.
Similar News
News April 1, 2026
ఐడియా చెప్పండి.. రూ.10లక్షలు గెలుచుకోండి!

ప్లాస్టిక్ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ‘BIOPACKATHON 2026’ నిర్వహిస్తోంది. భూమిలో కరిగిపోయే ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఐడియాలు ఇచ్చేవారికి భారీగా బహుమతులు అందిస్తారు. మొదటి బహుమతిగా ₹10 లక్షలు, సెకండ్ రూ.7లక్షలు, మూడో స్థానంలో నిలిచినవారు రూ.5లక్షలు గెలుచుకోవచ్చు. విజేతలకు నగదుతో పాటు పరిశ్రమలతో పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆసక్తి గల వారు ఏప్రిల్ 24, 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
News April 1, 2026
అమరావతి బిల్లుకు కాంగ్రెస్ మద్దతు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. దీనికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ తరఫున మాణిక్కం ఠాకూర్ ప్రకటన చేశారు. ఇక చర్చకు వైసీపీ తరఫున ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ బిల్లుపై చర్చకు రెండు గంటలు కేటాయించాలని టీడీపీ ఎంపీలు కోరారు. అయితే తొలుత గంట పాటు చర్చిద్దామని, తర్వాత అవసరమైతే మరో గంట పొడిగిస్తానని స్పీకర్ ఓం బిర్లా హామీ ఇచ్చారు.
News April 1, 2026
మేం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు: జగన్

AP: అమరావతికే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ తాము వ్యతిరేకం కాదని ప్రెస్‌మీట్‌లో YCP చీఫ్ జగన్ స్పష్టం చేశారు. ‘అమరావతి పేరుపై అప్పులు తెచ్చి స్కామ్‌లు చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో రోడ్లు, నీళ్లు, డ్రైనేజీకి రూ.2లక్షల కోట్లు కావాలి. అంత ఖర్చు చేసే స్థోమత మనకు ఉందా? ఏడేళ్లలో CBN ఖర్చు పెట్టింది రూ.8వేల కోట్లే. వీటికి అసెంబ్లీలో CBN సమాధానం చెప్పాడా?’ అని ప్రశ్నించారు.


