News February 5, 2025
కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
Similar News
News October 26, 2025
సెలవు రోజులలో పాఠశాలలో తెరిస్తే కఠిన చర్యలు: DEO

మొంథా తుపాను నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలలకు 27, 28 తేదీలలో 2 రోజులు సెలవులు ప్రకటించినట్లు DEO కంది వాసుదేవరావు ప్రకటించారు. తుపాన్ నేపథ్యంలో ప్రజలకు అవసరమైతే పునరావాసం కోసం HMలు అందుబాటులో ఉండి పాఠశాల భవనాలు ఇవ్వాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాలల పట్ల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సెలవు దినాలలో రూల్స్ బ్రేక్ చేస్తూ పాఠశాలలు తెరిచిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని DEO హెచ్చరించారు.
News October 26, 2025
నిడిగొండ త్రికూట ఆలయాన్ని సందర్శించిన హెరిటేజ్ బృందం

రఘునాథపల్లి మండలం నిడిగొండలోని త్రికూట ఆలయాన్ని ‘హైదరాబాద్ హెరిటేజ్ వాక్’ మిత్ర బృందం సభ్యులు ఆదివారం సందర్శించారు. స్థానిక శివాలయం, ఇతర చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను ఆలయ పూజారి కృష్ణమాచార్యులు వారికి వివరించారు. అంతకుముందు జనగామ మండలం పెంబర్తిలోని హస్త కళలను సందర్శించి, అక్కడ వర్క్‌షాపు నిర్వహించారు.
News October 26, 2025
సిరిసిల్ల: రేపటి ప్రజావాణి రద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రేపు (అక్టోబర్ 27) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించిన లక్కీ డ్రా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.


