News February 5, 2025

జగిత్యాల: కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా

image

మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, 2018లో సిరిసిల్ల జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా జీవితం మొదలు పెట్టారు. అనంతరం 2020లో జగిత్యాల జిల్లాలోని పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. అనంతరం కథలాపూర్, వెల్గటూర్, కోరుట్లలో కూడా పనిచేశారు. ప్రస్తుతం డీసీఆర్బీ ఎస్ఐగా ఉన్నారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 13, 2026

వరంగల్: పది పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: ఈస్ట్ జోన్ డీసీపీ

image

రేపటి నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు విధించినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో 150 పరీక్ష కేంద్రాల్లో(HNK 64, WGL 47 జనగామ 39) రేపటి నుంచి ఏప్రిల్ 16 వరకు సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్(144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, జిరాక్స్ సెంటర్లను బంద్ చేయాలన్నారు.

News March 13, 2026

వంటగ్యాస్.. దేశ ప్రజలకు కేంద్రం సూచన

image

దేశవ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వంటగ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ప్రజలు ఆందోళన పడి పానిక్ బుకింగ్ చేసుకోవద్దని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పంపిణీని పర్యవేక్షించాలంది. టీవీలు పదేపదే పాత విజువల్స్‌ను చూపించవద్దని కోరింది. డేట్ వేసి విజువల్స్ ప్రసారం చేయాలని, దీనివల్ల ప్రజలకు కచ్చితమైన సమాచారం చేరుతుందని తెలిపింది.

News March 13, 2026

వార్డు ప్లానర్‌కే ఏసీపీ పీఠమా? ఏలూరు కార్పొరేషన్‌లో వింత పోకడ!

image

ఏలూరు కార్పొరేషన్ పట్టణ ప్రణాళిక విభాగంలో గెజిటెడ్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. ఉన్నతాధికారులు తమ స్వార్థం కోసం ఒక వార్డు ప్లానర్‌కు అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాధ్యతలు కట్టబెట్టడం విమర్శలకు దారి తీస్తోంది. హోమ్ గార్డ్ స్థాయి వ్యక్తితో డీఎస్పీ స్థాయి పనులు చేయిస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని, దీనిపై విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.