News February 5, 2025

MLC ఎన్నికలు.. గుంటూరులో మహేశ్ బాబుకు ఓటు 

image

గుంటూరు, కృష్ణాజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా గుంటూరు పట్టణ పరిధిలో ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. డోర్ నంబర్ 31-22-1639, విద్యార్హత బీకాం, పుట్టిన తేదీ 1975 ఆగస్టు 9వ తేదీన వివరాలతో బూత్ నంబర్ 2014, వరుస సంఖ్య 1179తో మహేశ్ బాబు ఫొటో అప్లోడ్ చేసినట్లు జాబితాలో ఉంది. కాగా ఈ విషయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Similar News

News March 30, 2026

నెల్లూరు: మంత్రి పదవి రేసులో ఇద్దరు MLAలు !

image

జిల్లాలో ఇద్దరు MLAలను మంత్రి పదవులు ఊరిస్తున్నాయి. కోవూరు MLA ప్రశాంతి రెడ్డి మంత్రి పదవి ఆశిస్తుండగా నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డి కూడా రేసులో ఉన్నారు. YCP నుంచి వచ్చిన వీరికి మంత్రి పదవులు వస్తే సీనియర్లు సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఒకరికి మోదం.. మరొకరికి ఖేదంగా మారుతోంది. అధిష్ఠానం ఎవరి వైపు మొగ్గు చూపినా TDPలో ముసలం మొదలై సార్వత్రిక ఎన్నికల్లో ఫలితం మారే అవకాశం ఉంది.

News March 30, 2026

మానవత్వం చాటుకున్న తిరువూరు కానిస్టేబుల్

image

తిరువూరులో ఓ మహిళకు పోలీస్ సిబ్బంది సమయానికి సహాయం చేసి మానవత్వాన్ని చాటారు. పాల్వంచకు చెందిన మహిళ పొరపాటున తప్పు పరీక్షా కేంద్రానికి వెళ్లి ఆందోళన చెందుతున్న సమయంలో, పోలీస్ సిబ్బంది జె. సూర్యనారాయణ ఆమెను గుర్తించి తన బైక్‌పై సరైన కేంద్రానికి సమయానికి చేర్చారు. ఆయన సేవాభావంపై మహిళ కృతజ్ఞతలు తెలిపగా, అధికారులు కానిస్టేబుల్‌ను అభినందించారు.

News March 30, 2026

వనపర్తి: సీనియర్ కాంగ్రెస్ నేత రాగివేణు మృతి

image

వనపర్తిలోని రాయిగడ్డకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి రాగివేణు సోమవారం ఉదయం అకాల మరణం చెందారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్ రూమ్‌లోకి వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే వేణు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన అకాల మరణంతో పార్టీకి తీరని లోటని దేవన్న నాయుడు సంతాపం తెలిపారు.