News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News March 21, 2026

వనపర్తి: అగ్నివీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం!

image

భారత సైన్యంలో 2027 సంవత్సరానికి గానూ ‘అగ్నివీర్’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభమైనట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 1వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గరిష్ఠ వయోపరిమితిని 21 నుంచి 22 ఏళ్లకు పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

దరఖాస్తుకు వెబ్‌సైట్:
www.joinindianarmy.nic.in

News March 21, 2026

నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

image

నిర్మల్, ఖానాపూర్, బైంసా మూడు మున్సిపాలిటీలలో ఆస్తీ పన్నుల వసూలుకు జిల్లాలో మున్సిపల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ ద్వారా వార్డ్ ఆఫీసర్లు ఇంటింటా తిరుగుతూ పన్నులను వసూలు చేస్తున్నారు. మార్చి 31 నాటితో గడువు తేదీ ముగియనుండగా ఈ నెల 1 నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. మరో 11 రోజులు గడువు మాత్రమే ఉంది. 100% లక్ష్యాన్ని అధికారులు నెరవేరుస్తారా చూడాలి.

News March 21, 2026

రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

image

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇటీవల కేంద్రం అనౌన్స్ చేసిన 10% గ్యాస్‌కు ఇది అదనం. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.