News March 19, 2024

అప్పుడు అబ్బాయికి, ఇప్పుడు బాబాయ్‌కి బీజేపీ పోటు

image

RLJP ఫౌండర్ రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్, బాబాయ్ పశుపతికి విభేదాలొచ్చాయి. పార్టీని బాబాయ్ చేజిక్కించుకుని అబ్బాయ్‌ని వెళ్లగొట్టారు. అప్పుడు BJP పశుపతికే సపోర్ట్ చేసి, కేంద్రమంత్రి పదవి ఇచ్చింది. చిరాగ్ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) ఏర్పాటుచేశారు. మారిన పరిస్థితులతో ఇప్పుడు చిరాగ్ పార్టీకే NDA 5 సీట్లను కేటాయించింది. దీంతో పశుపతి కేంద్రమంత్రి పదవికి <<12882991>>రిజైన్<<>> చేశారు.

Similar News

News November 4, 2025

DEC లేదా JANలో భోగాపురం నుంచి టెస్ట్ ఫ్లైట్: రామ్మోహన్

image

AP: భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు 91.7% పూర్తైనట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ తెలిపారు. ‘గడువుకు ముందే పనులను పూర్తి చేయాలని నిశ్చయంతో ఉన్నాం. DEC ఆఖరు లేదా JAN తొలి వారంలో టెస్ట్ ఫ్లైట్ ఎగరనుంది. ఏవియేషన్ వర్సిటీ, ఇండిగో హబ్ ఏర్పాటుకు యత్నిస్తున్నాం. భోగాపురంలో స్కిల్ వర్సిటీలు నిర్మిస్తాం’ అని తెలిపారు. అంతకుముందు విమానాశ్రయానికి వచ్చిన ఆయనకు జీఎంఆర్ ప్రతినిధులు పనుల పురోగతిని వివరించారు.

News November 4, 2025

సైన్యాన్ని కూడా ఆ 10% మందే నియంత్రిస్తున్నారు: రాహుల్

image

బిహార్ ఎన్నికల ప్రచారంలో CONG నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది. ‘దేశంలోని 10% జనాభాకే (అగ్రవర్ణాలు) కార్పొరేట్ సెక్టార్, బ్యూరోక్రసీ, జుడీషియరీలో అవకాశాలు దక్కుతున్నాయి. చివరకు ఆర్మీ కూడా వారి కంట్రోల్‌లోనే ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. 90% ఉన్న SC, ST, BC, మైనారిటీలు కనిపించరని పేర్కొన్నారు. కాగా భారత సైనికుల్ని చైనా సైన్యం కొడుతోందని ఇదివరకు RG కామెంట్ చేయగా SC మందలించింది.

News November 4, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

✒ మోకాలి గాయంతో బిగ్‌బాష్ లీగ్‌ సీజన్‌-15కు అశ్విన్ దూరం
✒ రంజీ ట్రోఫీ: రాజస్థాన్‌పై 156 రన్స్ చేసిన ముంబై బ్యాటర్ యశస్వీ జైస్వాల్
✒ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్: IND-A కెప్టెన్‌గా జితేశ్ శర్మ, జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు
✒ ICC ఉమెన్స్ ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నం.1గా లారా వోల్వార్డ్ట్.. రెండో స్థానానికి చేరిన స్మృతి మంధాన
✒ U19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీకి ఎంపికైన ద్రవిడ్ కుమారుడు అన్వయ్