News February 5, 2025
ఎస్సీ వర్గీకరణతో ఎవరికీ ఇబ్బంది ఉండదు: మంత్రి రాజనర్సింహా

ఎస్సీ వర్గీకరణతో ఎవరి ప్రయోజనాలకూ ఇబ్బంది కలగదని మంత్రి దామోదర రాజనర్సింహా స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. 40ఏళ్ల కల నేడు సాకారం అవుతోందని అన్నారు. 30ఏళ్ల సమస్యకు నేడు పరిష్కారం దొరికిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో కొందరిలో భయం, అభద్రతాభావం ఉందన్న ఆయన వర్గీకరణ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని తెలిపారు.
Similar News
News March 1, 2026
దౌత్యమే కాపాడింది.. ఆ ఒక్క గల్ఫ్ దేశం సేఫ్!

US, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడుల్లో భాగంగా గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతున్న ఇరాన్ ఒమన్‌ను మాత్రం విడిచిపెట్టింది. దౌత్యంలో US, ఇరాన్‌లకు ఒమన్ సమాన ప్రాధాన్యం ఇవ్వడమే కారణం. గతంలో పలు సందర్భాల్లో ఇరు దేశాలకు ఒమన్ మధ్యవర్తిగా పనిచేసింది. దీంతో పాటు ఒమన్‌లో US స్థావరం లేదు. మరోవైపు బహ్రయిన్, కువైట్, ఖతార్, UAE, సౌదీ USకు మద్దతు ఇస్తున్నాయి. కాగా ఒమన్‌లో దాదాపు 9లక్షల మంది భారతీయులు ఉన్నారు.
News March 1, 2026
బిచ్కుంద: 24 గంటల్లోనే హత్య కేసు నిందితుడి అరెస్ట్

భూ తగాదాల నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బిచ్కుంద CI రవి తెలిపిన వివరాలు.. బిచ్కుందకు చెందిన సాయిలు, అతని సోదరుడు నారాయణ మధ్య కొంతకాలంగా భూ వివాదాలు నడుస్తున్నాయి. ఆగ్రహానికి లోనైన నారాయణ సాయిలు తలపై కర్రతో బలంగా బాదాడు. తీవ్ర గాయాలైన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు నారాయణను పట్టుకొని, హత్యకు వాడిన కర్రను స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు. SI రాజు ఉన్నారు.
News March 1, 2026
నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు నిర్వహణ పనుల కారణంగా పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. మార్చి 7వ తేదీ వరకు రద్దు చేశారు. కాచిగూడ – నిజామాబాద్ (77601), నిజామాబాద్ – కాచిగూడ (77602), నిజామాబాద్ – నాందేడ్ (77645), నాందేడ్ – నిజామాబాద్ (77646) రైళ్లు రద్దయ్యాయి.


