News February 5, 2025
విద్యార్థినిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

విద్యార్థినిపై అత్యాచారం కేసులో జూనియర్ లెక్చరర్ వేదాల వినయ్ మంగళవారం పోలీసులకు లొంగిపోయాడు. కేసు వివరాలను కొవ్వూరులో DSP దేవకుమార్ తెలిపారు. భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న వినయ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కాలేజీలో జూ.లెక్చరర్‌గా పని చేస్తున్నారు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి ఇంటర్ సెకండియర్ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఈ నెల 28న విజయవాడలో లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
Similar News
News March 14, 2026
బనగానపల్లెలో యువకుడి సూసైడ్

బనగానపల్లెలో తెలుగు పేటకు చెందిన హేమంత్ కుమార్(20) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఎస్సై కల్పన తెలిపిన వివరాల మేరకు.. హేమంత్ కుమార్ ఇటీవల బైక్ కొనుగోలు చేశాడు. కంతులు చెల్లించలేదన్న కారణంతో ఫైనాన్షియర్లు బైకును తీసుకువెళ్లారు. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News March 14, 2026
రాజమండ్రి: లోక్ అదాలత్‌లో 18,441 కేసుల పరిష్కారం

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో 18,441 కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయాధికారి గంధం సునీత తెలిపారు. 17,672 క్రిమినల్, 630 సివిల్, 139 ప్రీ-లిటిగేషన్ కేసులు ఉన్నాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 18,302 కేసులకు మోక్షం లభించడంతో కక్షిదారులకు ఊరట లభించింది. పరస్పర అంగీకారంతో రాజీ పడటం ద్వారా సమయం ఆదా అవుతుందని, బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని ఆమె పేర్కొన్నారు.
News March 14, 2026
గుత్తి కోటలో రేపు జరగబోయే కార్యక్రమాలు ఇవే!

గుత్తి కోట ఉత్సవాలలో భాగంగా గుత్తిలోని ఫుట్ బాల్ గ్రౌండ్ నుంచి గుత్తి కోట వరకు హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన, అతిథుల ప్రసంగం, సంధ్యామూర్తి శ్రీ నృత్య కళానిలయం వారి శివ పాదం, (జబర్దస్త్) డా.శాంతి కుమార్ మిమిక్రీ, గంగమ్మ జాతర చేయనున్నారు.


