News February 5, 2025

MBNR: వివాహితపై లైంగిక దాడి

image

MBNR జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ తండాకు చెందిన వివాహితపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గిరిజనతండాకు చెందిన వివాహిత పొలానికెళ్లి వస్తుండగా.. శంకర్‌నాయక్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News February 5, 2025

రామగుండం: పదవీకాలం ముగిసింది.. ఫోన్ నంబర్లు బ్లాక్

image

రామగుండం కార్పొరేషన్ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో అధికారికంగా ఇచ్చిన సెల్ ఫోన్లు మూగనోము పాటిస్తున్నాయి. 50 మంది కార్పొరేటర్లు, 5 కో-ఆప్షన్ సభ్యులు పదవీకాలం ముగియడంతో సంబంధిత అధికారులు ఈ నంబర్లను బ్లాక్ చేశారు. ఇప్పటికే సెల్ ఫోన్లను ఆఫీస్‌కు అప్పగించాల్సి ఉండగా యథావిధిగా ఉపయోగించుకుంటున్నారు. వీటికి సంబంధించి నెల నెల బిల్లులు చెల్లిస్తూ వచ్చింది.

News February 5, 2025

కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీవో, ఏపీవోలను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.ఉపాధి హామీ పనుల పురోగతి అంశంపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. పనుల కల్పనలో వెనుకబడిన అధికారులతో మాట్లాడారు. కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్నారు.

News February 5, 2025

‘హరిహర వీరమల్లు’ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం

image

పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘హరిహర వీరమల్లు’ పార్ట్-1 షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈరోజు నుంచి మూవీ ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. పవన్ త్వరలోనే షూటింగ్‌లో చేరనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకూ జరిగే ఈ షెడ్యూల్ పూర్తైతే మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు తెలుస్తోంది. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

error: Content is protected !!