News February 5, 2025
యువతిని బెదిరించి డబ్బులు వసూలు.. నిందితుడు అరెస్ట్

నగ్న వీడియోలు బయటపెడతానని నిడదవోలుకు చెందిన యువతిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు. మంగళవారం కొవ్వూరులో మీడియాతో మాట్లాడారు. నిందితుడు రూ.2కోట్ల 53 లక్షలు వసూలు చేశాడని చెప్పారు. నిందితుడికి చెందిన రూ.కోటి 81 లక్షల విలువ గల ఆస్తులు సీజ్ చేసినట్లు తెలిపారు. కాగా నిందితుడి ఫోన్‌లో ఎటువంటి వీడియోలు లభ్యం కాలేదన్నారు.
Similar News
News March 24, 2026
RDTకి అనుమతులు.. CBN క్రెడిట్ చోరీ: జగన్

AP: RDTకి FCRA <<19461876>>అనుమతుల<<>> విషయంలో CM CBN క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యంగా ఉందని జగన్ ట్వీట్ చేశారు. ‘నిజంగా ఆయన కృషి చేసి ఉంటే 2025 APRలో నిలిచిపోయిన పర్మిషన్ల రెన్యువల్‌కు ఏడాదికాలం ఎందుకు పట్టింది? CBN పట్టించుకోకపోవడం వల్లే YCP, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమం చేయాల్సి వచ్చిందన్నది వాస్తవం కాదా’ అని ప్రశ్నించారు. పర్మిషన్లు రెన్యువల్ చేసినందుకు PM మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.
News March 24, 2026
TU: M.Ed మూడవ సెమిస్టర్ పరీక్షలు.. ఇద్దరు ఆబ్సెంట్

టీయూ పరిధిలో ఎం.ఎడ్ (M.Ed) 3వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు మంగళవారం నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో ప్రశాంతంగా జరిగాయి. ఈరోజు మధ్యాహ్నం జరిగిన ‘ఏఐ టూల్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పరీక్షకు 29 మంది విద్యార్థులకు 27 మంది విద్యార్థులు హాజరు కాగా ఇద్దరు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదన్నారు.
News March 24, 2026
కామారెడ్డిలో రేపు జాబ్ మేళా

కామారెడ్డి కలెక్టరేట్‌లో బుధవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజని కిరణ్ తెలిపారు. అపోలో ఫార్మసీలో 100 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ అసలు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.


