News February 5, 2025
MLC ఎన్నికలు..జిల్లాలో మహేశ్ బాబుకు ఓటు

ఉమ్మడి గుంటూరు, కృష్ణాజిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా గుంటూరు పట్టణ పరిధిలో హీరో మహేశ్ బాబు పేరుతో ఓటర్ జాబితాలో ఓటు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది. డోర్ నంబర్ 31-22-1639, విద్యార్హత బీకాం, పుట్టిన తేదీ 1975 ఆగస్టు 9వ తేదీన వివరాలతో బూత్ నంబర్ 2014, వరుస సంఖ్య 1179తో మహేశ్ ఫొటో అప్లోడ్ చేసినట్లు జాబితాలో ఉంది. కాగా ఈ విషయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 13, 2025
19న అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు

కడప వైవీయూ ఆధ్వర్యంలో ఈనెల 19వ తేదీన అంతర్ కళాశాలల బ్యాడ్మింటన్ పోటీలు జరగనున్నాయి. బద్వేలు బిజివేముల వీరారెడ్డి డిగ్రీ కాలేజీలో ఈ పోటీలు నిర్వహిస్తారు. పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయని వైవీయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ కె.రామసుబ్బారెడ్డి తెలిపారు. క్రీడాకారులు వైవీయూ అనుబంధ కళాశాలల్లో చదివి, 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు అర్హులన్నారు.
News November 13, 2025
కామారెడ్డి: రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు శిక్షణ

కామారెడ్డి, నిజామాబాద్, మెదక్ జిల్లాల రైతు ఉత్పత్తిదారుల సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు గురువారం ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు వ్యవసాయ రంగంలో సమూహ బలం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారన్నారు.
News November 13, 2025
ఈ నెల 14న 58వ జాతీయ గ్రంధాలయం వారోత్సవాలు

వనపర్తిలోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో 58వ జాతీయ గ్రంధాలయం వారోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ జి గోవర్ధన్, కార్యదర్శి బి.వెంకటయ్య తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు సాగే వారోత్సవాలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభిస్తారన్నారు. విద్యార్థిని, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.


