News February 5, 2025
సంగారెడ్డి: అర్ధరాత్రి అరెస్టుల దుమారం

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలంలో అర్ధరాత్రి అరెస్టుల దుమారం నెలకొంది. స్థానిక నల్లవల్లి అటవీ ఫారెస్టులో నూతనంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోని మండల పరిధిలోని ఆయా గ్రామాల నాయకులు బీఆర్ఎస్ నాయకులు, గోవర్దన్ రెడ్డి, కుమార్ గౌడ్ మంగళవారం రాత్రి ముందస్తు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ఉలిక్కిపడిన ప్యారా నగర్, నల్లవల్లి గ్రామస్థులు డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Similar News
News April 10, 2026
గుంటూరు: ప్రేమ జంట ఆత్మహత్య

ఎడ్లపాడు(M) కొండవీడుకోటలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమికులు పురుగు మందు తాగి చనిపోయారు. పోలీసుల వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన మనికంఠ రాజు అమ్మాయితో రెండేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఆమెకు మరో వ్యక్తితో పెళ్లయింది. దీంతో ఇరువురు పురుగు మందు తాగారు. స్థానికులు వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా 8వ తేదీ మణికంఠ, మరుసటి రోజు యువతి చనిపోయారు. వారి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
News April 10, 2026
ఈ నెలాఖరులోగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ

AP: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 2026-27 ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్నుపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించింది. అలాగే 2025-26 వరకు ఉన్న ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ మాఫీ సదుపాయాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
News April 10, 2026
రైతు భరోసా రెండో విడతపై అప్‌డేట్

TG: రైతు భరోసా రెండో విడత సాయాన్ని ఈ నెల 22లోపు అందించేందుకు ప్రభుత్వం నిధులు సిద్ధం చేస్తోంది. ఈ విడతలో 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నగదు జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే మూడో విడత సాయాన్ని ఈ నెలాఖరులోగా జమ చేయొచ్చని తెలుస్తోంది. కాగా గత నెల 23న తొలి విడత కింద ఒక ఎకరం భూమి వరకు రూ.6,000 చొప్పున సాయం అందించిన విషయం తెలిసిందే.


