News February 5, 2025

NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి

image

ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

Similar News

News November 12, 2025

18 రోజులు.. ఈసారి మహాభారతమే

image

ఢిల్లీ పేలుడుతో ఉగ్రవాదులకు కేంద్రం ధీటుగా బదులు చెప్పాలని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓ నెటిజన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘పుల్వామా ఉగ్రదాడికి కేంద్రం 12 రోజుల్లో బాలాకోట్ స్ట్రైక్‌తో బదులిచ్చింది. పహల్గాం దాడికి 15 రోజుల్లో ఆపరేషన్ సింధూర్‌తో బుద్ధి చెప్పింది. తాజా దాడికి బదులిచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుంది’ అని ప్రశ్నించగా మరో నెటిజన్ 18 రోజులు అని బదులిచ్చారు. ఈసారి మహాభారతమే అని రాసుకొచ్చారు.

News November 12, 2025

గురువు పాదాలకు నమస్కరించిన మంత్రి కేశవ్

image

రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన చిన్ననాటి గురువు గంగాధర శాస్త్రిని పుట్టపర్తి శాంతి నిలయంలో మంగళవారం కలిశారు. గురువు పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. విద్యార్థి దశలో బోధించిన ఉపాధ్యాయుడిని కలవడం ఆనందకరమైన క్షణమని మంత్రి భావోద్వేగంగా పేర్కొన్నారు. రాష్ట్రం గర్వించదగిన నాయకుడిగా శిష్యుడు ఎదగడంపై గంగాధర శాస్త్రి సంతోషం వ్యక్తం చేశారు.

News November 12, 2025

VZM: నేడు PMAY గృహ ప్రవేశాలు

image

విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో 8,793 ఇళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బుధవారం సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం జరగనుందని హౌసింగ్ పీడీ మురళీ తెలిపారు. బొండపల్లి మండలం అంబటివలస గ్రామంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేయనున్నారు. రాజాం, నెల్లిమర్ల, బొబ్బిలి, ఎస్.కోట, చీపురుపల్లి నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా గృహప్రవేశాలు జరుగనున్నాయి.