News March 19, 2024
రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ

TG: సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాశారు. ‘రజాకార్’ సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇచ్చి, ప్రోత్సహించాలని అందులో కోరారు. విద్యార్థుల కోసం ప్రత్యేక షో వేయాలన్నారు. కాగా తెలంగాణలో రజాకార్ల అకృత్యాల ఆధారంగా చిత్రీకరించిన ‘రజాకార్’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.
Similar News
News September 8, 2025
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!

TG: స్టీల్, సిమెంట్‌పై GST 28% నుంచి 18 శాతానికి తగ్గనుండటంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై కొంత భారం తగ్గనుంది. ఇంటి నిర్మాణానికి 180 సంచుల సిమెంట్ అవసరం కాగా సంచి ధర రూ.330-370గా ఉంది. GST తగ్గడం ద్వారా సంచిపై రూ.30 చొప్పున రూ.5,500 ఆదా అయ్యే అవకాశం ఉంది. అటు 1500 కిలోల స్టీల్ అవసరం పడుతుండగా కేజీ రూ.70-85 వరకు పలుకుతోంది. కేజీపై రూ.5 తగ్గినా రూ.7,500 ఆదా కానుంది. మొత్తం రూ.13వేల వరకు తగ్గనుంది.
News September 8, 2025
రష్యాపై మరిన్ని సుంకాలు: ట్రంప్

రష్యాపై మరిన్ని సుంకాలు విధిస్తామని US అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. ‘రష్యాపై సెకండ్ ఫేస్ టారిఫ్స్‌కు సిద్ధంగా ఉన్నారా?’ అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘నేను రేడీగా ఉన్నాను’ అని ఆయన సమాధానమిచ్చారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై కూడా అదనపు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, చైనా వంటి దేశాలపై మరిన్ని సుంకాలు విధించాలని US ట్రెజరీ సెక్రటరీ<<17644290>> బెసెంట్<<>> కూడా అన్నారు.
News September 8, 2025
జ్వరమని వెళ్తే.. మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి!

TG: కరీంనగర్‌లో దారుణం వెలుగు చూసింది. జగిత్యాల జిల్లాకు చెందిన యువతి జ్వరమొచ్చిందని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు సమాచారం. ఆస్పత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆమె నిద్రపోతున్నప్పుడు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.