News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News November 17, 2025

చిన్న అరుణాచలం ఆలయంలో అపశ్రుతి

image

దుమ్ముగూడెం మండలంలోని నరసాపురం గ్రామం చిన్న అరుణాచలం ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. భక్తులు దీపాలు వెలిగించిన అనంతరం ఆర్పే క్రమంలో నీళ్లనుకొని పక్కనే ఉన్న కార్పెంటైల్‌ను పోయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మహిళా భక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

News November 17, 2025

స్వర్ణ పంచాయతీల్లో 100% పన్ను వసూలు చేయాలి: కలెక్టర్

image

స్వర్ణ పంచాయతీలకు సంబంధించి 100% పన్ను వసూలు చేయాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌ సందర్భంగా వివిధ అంశాలపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఆవాస్ ప్లస్ గ్రామిన్ యోజన-2024 సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేయాలంటే ఈ సర్వేను తప్పకుండా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.

News November 17, 2025

పక్కా ప్లాన్‌తో మర్డర్.. కుప్పంలో దృశ్యం-3

image

దృశ్యం సినిమాను తలపించేలా కుప్పంలో శ్రీనాథ్‌ను పక్కా ప్లాన్‌తో <<18306471>>హత్య <<>>చేశారు. గత నెల 16, 18, 27వ తేదీల్లో శ్రీనాథ్ కుప్పం వచ్చాడు. ‘నీకు డబ్బులు ఇస్తా. కానీ కుప్పం వచ్చేటప్పుడు సెల్ ఫోన్ ఇంట్లోనే పెట్టాలి. కుప్పం రైల్వేస్టేషన్లో దిగగానే ఎవరు గుర్తుపట్టని విధంగా తలకు టోపీ, మాస్క్ వేసుకో. సీసీ కెమెరాల కంట పడకుండా రావాలి’ అని ప్రభాకర్ చెప్పాడు. అలాగే చేయడంతో శ్రీనాథ్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు.