News February 5, 2025

కేయూ: 20 నుంచి పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు

image

కేయూ పీజీ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 20 నుంచి జరగనున్నాయని ప్రొఫెసర్ రాజేందర్, ఆచార్య బీఎస్ఎల్ సౌజన్య ప్రకటనలో తెలిపారు. ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం, ఎంఎల్ఐఎస్సీ కోర్సులకు మొదటి సెమిస్టర్ 20, 22, 24, 27, మార్చి 1, 3 తేదీల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News March 17, 2026

ఇరాన్ ప్రజలకు ఇదే మంచి అవకాశం: నెతన్యాహు

image

తమ దాడిలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజనీ చనిపోయినట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు తెలిపారు. అలాగే ‘బసిజ్’ పారామిలిటరీ చీఫ్ గోలమ్‌రెజా సులేమానీ సైతం ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. ఇరాన్‌లో తమ దాడులు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశాన్ని ఇరాన్ ప్రజలకు కల్పించాలనే ఆశతోనే ఈ అటాక్స్ చేస్తున్నామని పేర్కొన్నారు. అన్నీ ఒకేరోజులో జరగవని.. స్థిరంగా పోరాడితే అన్నీ సాధ్యమేనన్నారు.

News March 17, 2026

తిరుపతి జిల్లాలో ఏనుగు దంతాల పట్టివేత..!

image

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం చిన్న రామాపురంలో అటవీ శాఖ అధికారులు మెరుపు దాడి చేశారు. ఆవులు మేపుకొంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి ఇంట్లో రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడిలో 20 మంది అధికారులు పాల్గొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ బంగ్లాకు తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు ముమ్మరం చేశారని సమాచారం.

News March 17, 2026

శ్రీశైలంలో భక్తులను అలరిస్తున్న కళారూపాల ప్రదర్శన

image

ఉగాది ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారుల వేషాలు భక్తులను అలరిస్తున్నాయి. శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరులు, మహిషాసురమర్ధిని, రాక్షస సంహారం, లంబాడీల సంప్రదాయ నృత్యం, మహిళల కోలాటం, రాజభటులు, విచిత్ర వేషధారణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.