News February 5, 2025
NZB: శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి: శైలి బెల్లాల్

కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం నిర్వహించే అంతర్ జిల్లాల యువ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా HYDలో ఈనెల 11 నుంచి 15 వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతీయువకులకు నైపుణ్య శిక్షణ ఉంటుందని NYK కో ఆర్డినేటర్ శైలి బెల్లాల్ తెలిపారు. ఎంపికైన 25 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని, శిక్షణలో పాల్గొనే ఆసక్తి ఉన్న వారు తమ వివరాలను 91004 35410 నంబర్ కు వాట్సాప్ చేయాలని ఆమె సూచించారు.
Similar News
News March 25, 2026
NZB: మహిళా కోటాలో ఓబీసీ మహిళకు సబ్ కోటా ఇవ్వాలి: కవిత

చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు భారతీయ ఆడబిడ్డల దశాబ్దాల కల అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఈ బిల్లుకు చట్టబద్దత కోసం జాగృతి అవిశ్రాంత పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఎంత ముఖ్యమో ఆ కోటాలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సబ్ కోటా ఇవ్వకుంటే ఆయా వర్గాల ఆడబిడ్డలకు చట్టసభల్లో అడుగుపెట్టే అవకాశం దక్కదని ట్వీట్ చేశారు.
News March 25, 2026
నిజామాబాదు: ఇంటర్ తర్వాత ఏ కోర్సు మేలు?

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పూర్తి చేసిన సుమారు 35 వేల మంది విద్యార్థులు తమ తదుపరి అడుగుల కోసం సిద్ధమవుతున్నారు. మార్కెట్ డిమాండ్ దృష్ట్యా ఎంపీసీ విద్యార్థులు ఏఐ, డేటా సైన్స్ వంటి కంప్యూటర్ కోర్సుల వైపు మొగ్గు చూపుతుండగా, బైపీసీ విద్యార్థులు అగ్రి బిఎస్సీ, ఫార్మసీ వంటి రంగాలను ఎంచుకోవడం ఉత్తమం. కామర్స్ వాళ్లు సీఏ, బీబీఏ కోర్సులు ఉపాధిని ఇస్తాయి. విద్యార్థులు ఆసక్తిని బట్టి ముందుకెళ్లాలి.
News March 25, 2026
NZB: అత్యధిక ఉష్ణోగ్రతల వైపు జిల్లా

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మోస్రా, జకోరా, ఎడపల్లి 38.9°C, గోపన్ పల్లి, మదన్ పల్లి, పెర్కిట్ నిజామాబాద్(నార్త్) 38.8, నిజామాబాద్(సౌత్), కోటగిరి 38.7, మోర్తాడ్ 38.6, సాలూరా, మాచర్ల 38.5°C అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లాలోని 45 వెదర్ స్టేషన్లలో 35°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా తుంపల్లిలో 14మి.మీ వర్షపాతం రికార్డు అయ్యింది.


