News February 5, 2025
ప.గో: పిల్లల చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఎర వేస్తారు

ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్‌లకు ఉమ్మడి ప.గో జిల్లాలోని యువత బానిసలవుతున్నారు. చిరువ్యాపారులు, నిరుద్యోగులు ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడి రోడ్డున పడుతున్నారు. ఇటీవల భీమవరంలో ఓ చిరు వ్యాపారి రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు. అనంతరం అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని, పిల్లలను పెద్దవారు నిత్యం గమనిస్తుండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Similar News
News April 3, 2026
అమరావతిని మార్చాలనుకోవడం తుగ్లక్ పని: CBN

AP: అమరావతిని శాశ్వత రాజధానిగా పార్లమెంటు చట్టం చేస్తే దాన్ని మార్చేస్తామనడం ఏం రాజకీయమని CM CBN ప్రశ్నించారు. ‘రాజధానిని ప్రతిసారీ మారుస్తామంటే ఎలా? దీనికి అర్థం ఉంటుందా? అమరావతి అని పలకడం ఇష్టం లేకే ఇలా మాట్లాడుతున్నారు. ఇలాంటి నేతలుండడం రాష్ట్ర దౌర్భాగ్యం. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని మార్చేందుకు అవకాశమే లేదు. అయినా అలా ప్రయత్నించడం తుగ్లక్ పనే అవుతుంది’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.
News April 3, 2026
ఆ రోజే BRSలోకి జీవన్ రెడ్డి..?

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గులాబీ గూటికి చేరనున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఏప్రిల్ 7న KTR ఆయన నివాసానికి వెళ్లి అధికారికంగా ఆహ్వానించనున్నట్లు సమాచారం. 13న పార్టీలో చేరిన అనంతరం, జగిత్యాలలోనే భారీ బహిరంగ సభతో ప్లీనరీ నిర్వహించేందుకు BRS సన్నద్ధమవుతోంది. అయితే, ఈ రాజకీయ మార్పుపై జీవన్‌రెడ్డి నుంచి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
News April 3, 2026
విటమిన్స్.. వాటి కెమికల్ నేమ్స్

☛ విటమిన్ A: రెటినోల్, కెరోటినాయిడ్లు
☛ B1: థయామిన్; B2: రైబోఫ్లేవిన్; B3: నియాసిన్, B5: పాంటోతేనిక్ యాసిడ్, B6: పైరిడాక్సిన్; B7: బయోటిన్; B9: ఫోలిక్ యాసిడ్; B12: సైనోకోబాలమిన్/హైడ్రాక్సోకోబాలమిన్;
☛ విటమిన్ C: ఆస్కార్బిక్ యాసిడ్;
☛ విటమిన్ D: కాల్సిఫెరాల్;
☛ విటమిన్ E: టోకోఫెరాల్/టోకోట్రైనోల్
☛ విటమిన్ K: ఫిల్లోక్వినోన్/మెనాక్వినోన్లు
#ShareIt


