News February 5, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

Similar News

News April 2, 2026

ప్రత్యేక ధరలు, సబ్సిడీలు ఇవ్వాలని ఎంపీ కావ్య డిమాండ్

image

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా.కడియం కావ్య ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో ఎంపీ మాట్లాడుతూ.. మార్కెట్ ఆధారిత ధరల విధానంతో రైతులపై అదనపు భారం పడుతోందని, సాగు ఖర్చులు పెరిగి రైతుల ఆదాయాలు దెబ్బతింటున్నాయన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యక్ష ఉపశమనం కల్పించే విధంగా ప్రత్యేక ధరలు లేదా సబ్సిడీలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.

News April 2, 2026

వరంగల్: ప్రాణదాతలు.. ఈఎంటీలు!

image

అత్యవసర స్థితిలో ఉన్న బాధితులకు ప్రాథమిక చికిత్స అందిస్తూ, ఆసుపత్రులకు చేర్చి ప్రాణాలు నిలబెడుతున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ల సేవలు అమోఘం. ఉమ్మడి వరంగల్‌లో 109 మంది ఈఎంటీలు గడిచిన ఏడాదిలో 1,17,054 మందిని కాపాడారు. జనవరిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను సమయస్ఫూర్తితో MGMకు తరలించిన కర్ణాకర్ వంటి వారు ఎందరో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేడు ‘జాతీయ ఈఎంటీ దినోత్సవం’.

News April 2, 2026

వరంగల్: అంగన్‌వాడీ పోస్టులు ఎప్పుడు..?

image

వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో 919 కేంద్రాలు ఉండగా.. 66 టీచర్, 284 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్, వర్ధన్నపేట, నర్సంపేట ప్రాజెక్టుల పరిధిలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. సిబ్బంది కొరతతో ఉన్న టీచర్లకే అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పౌష్ఠికాహారం, సర్వేలు సక్రమంగా జరగడం లేదు.