News February 5, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

Similar News

News September 13, 2025

HYD: జీహెచ్ఎంసీలో 97మందికి పదోన్నతులు

image

జీహెచ్ఎంసీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, వారితో సమాన స్థాయి హోదా ఉన్న 97 మందికి సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం మేరకు తాత్కాలిక పదోన్నతి కల్పించినట్లు పేర్కొన్నారు.

News September 13, 2025

పటాన్‌చెరు: దేవుడు స్థలాన్ని చూపించాడని మిస్సింగ్

image

యువకుడు అదృశ్యమైన ఘటన పటాన్‌చెరులో చోటు చేసుకుంది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఇందిరమ్మ కాలనీకి చెందిన వీరేశ్ (22) గురువారం డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి తిరిగి రాలేదు. ‘నాకు కలలో దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు అక్కడికి వెళ్తున్నాను’ అని అన్నకు మెసేజ్ పెట్టాడు. వెంటనే ఫోన్ చేయగా స్విచ్‌ఆఫ్ వచ్చింది. తమ్ముడి మిస్సింగ్ పై అన్న పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News September 13, 2025

MLA సంజయ్‌కు ఇంటిపోరు.. మళ్లీ ‘గేర్’ మారుస్తారా?

image

పార్టీ ఫిరాయింపు నోటీసుపై BRSలోనే ఉన్నట్లు JGTL MLA సంజయ్ స్పీకర్‌కు వివరణ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అలాగే స్థానికంగా తనది ఏ పార్టీనో చెప్పుకోలేని సంకట స్థితిలో MLA ఉన్నారు. కాగా, ఎవరి పార్టీలో వారుంటే మంచిదే కదా అంటూ ఇప్పటికే మాజీమంత్రి జీవన్ రెడ్డి సంజయ్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అయితే సంజయ్‌కు ఇంటిపోరు ఎక్కువవ్వడంతో CONGలో ఉంటారా? BRSలోకి వెళ్తారా? అన్న చర్చ జరుగుతోంది.