News February 5, 2025

వరంగల్: క్వింటా పత్తి ధర రూ. 6,980

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయింది. అలాగే నేడు రూ.20 పెరిగి రూ.6,980 కి చేరినట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. గత వారం క్రమంగా పెరుగుతూ వచ్చిన పత్తి ధర ఇప్పుడు తగ్గుతుండటంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు.

Similar News

News March 5, 2026

నల్గొండ: ఈ ఆలయానిది 200 ఏళ్ల చరిత్ర

image

చండూరు మండలం తుమ్మలపల్లిలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. కోనేరు వద్ద వెలిసిన లింగాన్ని చూసి రామ్‌సింగ్, పీత సింగ్ సోదరులు ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. 1895లో రాపోలు సాదుపుల్లయ్య ఇక్కడ శివరాత్రి కళ్యాణ వేడుకలు ప్రారంభించగా, నిజాం ప్రభుత్వం ఆలయానికి 28 ఎకరాల భూమిని మంజూరు చేసింది. ఏ కాలంలోనూ ఎండిపోని ‘పుట్టుగుండం’ ఇక్కడి ప్రత్యేకత.

News March 5, 2026

అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

image

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థులు ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి వెంకటేష్ తెలిపారు. ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 31వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు సంబంధిత కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

News March 5, 2026

పార్వతీపురం: ఇంటర్‌ బోటనీ పరీక్షకు 392 మంది గైర్హాజరు

image

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోటనీ పరీక్షకు 392 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DVEO నాగేశ్వరరావు గురువారం తెలిపారు. జనరల్ విద్యార్థులు 2282 మందికి 63 మంది గైర్హాజరు అయ్యారని చెప్పారు. ఒకేషనల్ విద్యార్థులు 2914 మందికి గానూ 329 మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5196 మంది విద్యార్థులకు 392 మంది గైర్హాజరు అయ్యారని అన్నారు