News February 5, 2025
NLG: పరిషత్తు.. కసరత్తు

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తాజాగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే మొదట నిర్వహిస్తామని చెబుతుండటంతో యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాలో 33 జడ్పీటీసీలు, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న GP ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు.
Similar News
News April 18, 2026
NLG: పాలిసెట్ విద్యార్థులకు గుడ్ న్యూస్

పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష (పాలిసెట్) రాసే విద్యార్థులకు నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ కేవీ.నరసింహారావు తెలిపారు. ఏప్రిల్ 20 నుంచి మే 11 వరకు తరగతులు జరుగుతాయన్నారు. మే 13న జరగనున్న పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పారు. విద్యార్థులు ఈనెల 18, 19వ తేదీల్లో కళాశాలలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
News April 18, 2026
అడవిదేవులపల్లిలో అత్యధికంగా ఉష్ణోగ్రత

జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఐదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా, అడవిదేవులపల్లిలో అత్యధికంగా 43 డిగ్రీలు నమోదైంది. ఈనెల 13 నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో జనం విలవిలలాడుతున్నారు. మే నెల చివరి వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
News April 18, 2026
ఎండలు పెరుగుతున్నాయ్ జాగ్రత్త: కలెక్టర్ చంద్రశేఖర్

జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శుక్రవారం ఆయన జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వేసవి కార్యాచరణపై సమీక్షించారు. రానున్న 3 నెలలు ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. టోల్ ఫ్రీ నెం. 18004251422, వాట్సాప్ నెం. 6305951279 అందుబాటులో ఉంటాయన్నారు.


