News February 5, 2025

రాయికల్: ఉరేసుకుని యువకుడి సూసైడ్

image

ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ కేంద్రంలో జరిగింది. స్థానికుల పక్రారం.. ఇందిరానగర్ కాలనీకి చెందిన గాజుల మనోజ్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఈరోజు యువకుడు చెట్టుకి ఉరేసుకుని కనిపించాడు. యువకుడి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 16, 2026

గార్ల: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి

image

ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతిచెందిన విషాద ఘటన మండలంలోని అంకన్నగూడెంలో శుక్రవారం జరిగింది. పోలీసు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన పెండకట్ల అశోక్(33) అనే రైతు తన సొంత వ్యవసాయ భూమిలో ఉన్న బావిలో మోటార్ మరమ్మతుల కోసం బావిలో దిగగా ప్రమాదవ శాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. మృతిడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News January 16, 2026

రొమాన్స్‌కు నో చెప్తే ఒత్తిడి చేశారు: తమన్నా

image

కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులు పడినట్లు హీరోయిన్ తమన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘సీనియర్ స్టార్లతో రొమాన్స్(ఇంటిమేట్) చేయాలని దర్శకుడు కోరితే కంఫర్ట్ లేకపోవడంతో నో చెప్పా. ఆ సమయంలో హీరోయిన్‌ను మార్చాలని అరుస్తూ దర్శకుడు నాపై ఒత్తిడి చేయాలని చూశారు. అయినా వెనక్కి తగ్గొద్దని నిర్ణయించుకున్నా. చివరకు దర్శకుడే సారీ చెప్పారు’ అని పేర్కొన్నారు. ఇండస్ట్రీలో సురక్షితమైన వాతావరణం ఉండాలని అభిప్రాయపడ్డారు.

News January 16, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ ఫర్నిచర్ అసిస్టెంట్ ట్రైనింగ్ కోసం రేపు కలెక్టరేట్లో ఇంటర్వ్యూ
✓ భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో సదుపాయాలు కల్పించాలి: CPIML
✓ జూలూరుపాడు: అదుపుతప్పి గోడను ఢీకొన్న గ్యాస్ లారీ
✓ టేకులపల్లి: క్రికెట్ పోటీలు అడ్డుకున్న పోలీసులు
✓ పినపాక: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన డీఎస్పీ
✓ పాల్వంచ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
✓ రామవరంలో పోలీసుల వాహన తనిఖీలు