News February 5, 2025
మట్టెవాడ క్రైం కానిస్టేబుల్‌కు ప్రశంసాపత్రం అందజేత

రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ జరిగిన దొంగతనాలను విశ్లేషించి చోరీలకు పాల్పడిన దొంగల వివరాలను సంబంధిత జిల్లాల పోలీస్ అధికారులకు సమాచారం అందిస్తున్న మట్టెవాడ క్రైం కానిస్టేబుల్ అలీకి వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ప్రశంసా పత్రం అందించారు. కేరళలోని తిరువనంతపురం, కొచ్చికి చెందిన పోలీస్ కమిషనర్లతో పాటు వికారాబాద్ ఎస్పీ అలీని అభినందిస్తూ తెలుపుతూ జారీ చేసిన ప్రశంసాపత్రాలను సీపీ అందజేశారు.
Similar News
News March 27, 2026
వరుణ్ ధవన్ కూతురికి ఆరోగ్య సమస్య.. నడవలేక..

తన కూతురు లారాకు DDH (డెవలప్‌మెంటల్ డిస్‌ప్లేసియా ఆఫ్ ది హిప్) అనే ఆరోగ్య సమస్య వచ్చిందని బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ తెలిపారు. ‘దీని వల్ల ఒక కాలు పొట్టిగా అవుతుంది. సరిగ్గా నడవలేకపోయింది. డాక్టర్లు సర్జరీ అవసరం లేకుండానే వైద్య ప్రక్రియతో తుంటిని యథాస్థానానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కోలుకుంటోంది. దీనిపై నేనొక పుస్తకం రాయాలనుకుంటున్నా’ అని వివరించారు. 2024లో వరుణ్, నటాషాకు లారా జన్మించింది.
News March 27, 2026
FLASH: WGL.. విదేశాల నుంచి వచ్చి తిరిగిరాని లోకాలకు

WGL-ఖమ్మం ప్రధాన రహదారిపై పున్నెలు క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఐనవోలు(M) సాగరానికి చెందిన పిన్నింటి తరుణ్(23) తన స్కూటీపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్నాడని, ఇటీవలే సెలవులపై సొంతూరుకు వచ్చినట్లు కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.
News March 27, 2026
DDH అంటే ఏంటి?

<<19493931>>DDH<<>> (డెవలప్‌మెంటల్ డిస్‌ప్లేసియా ఆఫ్ ది హిప్) అనేది చిన్న పిల్లల్లో తుంటి జాయింట్ సరిగ్గా ఏర్పడకపోవడం లేదా కదలడం వల్ల వచ్చే సమస్య. పుట్టుకతో వచ్చే హిప్ డిస్‌లొకేషన్ అని కూడా అంటారు. తుంటి ఎముకలోని సాకెట్‌లో తొడ ఎముక పైభాగం సరిగ్గా సెట్ కాకుండా పక్కకు లేదా బయటకు వస్తుంటుంది. దీని వల్ల నడకలో ఇబ్బందులు వస్తాయి. ఆర్థరైటిస్‌కు దారితీయొచ్చు. ముందే గుర్తించడం ద్వారా చికిత్స, సర్జరీతో నయం చేయొచ్చు.


