News February 5, 2025
కాళేశ్వరం: మహా కుంభాభిషేకానికి ప్రత్యేక బస్సులు

భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో ఈ నెల 7,8, 9న జరిగే మహా కుంభాభిషేకానికి హనుమకొండ, భూపాలపల్లి నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు భూపాలపల్లి ఆర్టీసీ డీఎం ఆమంచ ఇందు ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా బస్సులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వివరాల కోసం భూపాలపల్లి బస్ స్టేషన్ నంబర్ 73828 54256కు సంప్రదించవచ్చని ఆమె సూచించారు.
Similar News
News March 18, 2026
ఖమ్మం: విద్యుత్ కనెక్షన్లు ఇక సులభం

కొత్త విద్యుత్ కనెక్షన్ల ప్రక్రియను సరళతరం చేస్తూ ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి నూతన సర్వీస్ లైన్ ఛార్జీల విధానాన్ని ప్రకటించారు. ఇకపై క్షేత్రస్థాయి పరిశీలన అవసరం లేకుండా కేవలం లోడ్ ఆధారంగానే ఏకరీతి ఛార్జీలు వసూలు చేయనున్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చును విద్యుత్ సంస్థే భరిస్తుందని, దీంతో వినియోగదారులపై అదనపు భారం ఉండదన్నారు. ఈ నూతన విధానంతో కనెక్షన్ల ప్రక్రియలో వేగం, పారదర్శకత పెరుగుతాయని తెలిపారు.
News March 18, 2026
MBNR: ‘తొలిసారిగా డిజిటల్‌లో జనాభా గణన’

జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారని కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌లను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. 2021లో నిర్వహించవలసిన ఈ ప్రక్రియ కోవిడ్ కారణంగా ఆలస్యం అయిందన్నారు.
News March 18, 2026
సంగారెడ్డి: 25లోగా ‘రైతు భరోసా’కు దరఖాస్తు చేసుకోండి

రైతు భరోసా పథకానికి అర్హులైన కొత్త రైతులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ సూచించారు. ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పాస్ పుస్తకాలు పొందినా, గతంలో దరఖాస్తు చేసుకున్న వారు వివరాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని చెప్పారు. కావున రైతులు రైతు వేదికల్లోని మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


