News February 5, 2025

VZM: మరికొన్ని రోజుల్లో ‘రూట్’ క్లియర్..!

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని దీర్ఘకాలిక సమస్యగా ఉన్న పెదమానాపురం ఫ్లైఓవర్ పనులు ఊపందుకున్నాయి. గత కొంత కాలంగా నత్తనడకగా సాగిన పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రత్యేక దృష్టి పెట్టడంతో పనుల వేగం పుంజుకున్నాయి. మరో రెండు నెలల్లో బ్రిడ్జి పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అంటున్నారు. 

Similar News

News March 14, 2025

అంబేడ్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది: హరీష్ రావు

image

బాబాసాహెబ్ అంబేద్కర్‌ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ లో దుయ్యబట్టారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకొని దళితుల గురించి కాంగ్రెస్ మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కూడా కాంగ్రెస్ అవమానించింది నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రశ్నించే వారిని పగబట్టే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తూ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తుందని ధ్వజమెత్తారు.

News March 14, 2025

వికారాబాద్: ‘పండుగ పేరుతో హద్దులు దాటొద్దు’

image

హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు చల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తారు. అయితే కొందరు ఆకతాయిలు పండగ పేరుతో హద్దు మీరి ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి రంగులు పూయడం చేస్తారు. ఎదుటివారి ఇష్టంతో మాత్రమే రంగులు చల్లడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో దూరంగా ఉంచుతూ హుందాగా వ్యవహరించాలని, పండగ వాతావరణాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు తెలిపారు.

News March 14, 2025

సూపర్ ఐడియా కదా..!

image

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!

error: Content is protected !!