News February 5, 2025

ఫిబ్రవరి మొదటి వారంలోనే పెరిగిన ఉష్ణోగ్రత!

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. జిల్లాలోని గ్రామాలలో చలి తీవ్రత తగ్గుతూ.. ఎండ తీవ్రత పెరుగుతోంది. రెండు రోజులుగా జిల్లాలో 34 నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పుడే భానుడి ప్రతాపం ఈ విధంగా ఉంటే రానున్న ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Similar News

News March 14, 2025

బోరుగడ్డకు 14 రోజుల రిమాండ్

image

AP: రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్‌కు కోర్టు రిమాండ్ విధించింది. జైలులో లొంగిపోయిన ఆయనను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న చిలకలపూడి పోలీసులు అదనపు జిల్లా జడ్జి ముందు హాజరుపరిచారు. చిలకలపూడి పీఎస్‌లో నమోదైన కేసుల్లో అనిల్‌కు ఈ నెల 27 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.

News March 14, 2025

సిరిసిల్ల: వాహనం, డ్రైవర్ కు దరఖాస్తులు ఆహ్వానం

image

24/7 అందుబాటులో ఉండేలా వాహనం, డ్రైవర్ ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సొంత ఏసి వాహనం, వాహనానికి డ్రైవర్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సూచించారు. ఆసక్తి గలవారు ఈనెల 12వ తేదీ నుండి 18వ తేదీ వరకు కలెక్టరేట్లోని 33 వ నంబర్ రూమ్ లో సంప్రదించాలని ఆయన కోరారు.

News March 14, 2025

గుడిహత్నూర్‌లో యువకుడి సూసైడ్

image

ఆనుమానాస్పద స్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గుడిహత్నూర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రనికి చెందిన ఉప్పులేటి రవి గురువారం రాత్రి గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చెరుకొని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.

error: Content is protected !!